పెంపుడు జంతువులను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? చాలా మంది వాటిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. ముఖ్యంగా కుక్కలను చాలా మంది తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. వీటికి మంచి ఆహారం పెట్టడం, బర్త్‌డేలు చేయడం, ఫంక్షన్లకు తీసుకెళ్లడం లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. కానీ, ఎప్పుడైనా కుక్కలకు ఆస్తి రాసిచ్చారని విన్నారా? ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం! బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తన పెంపుడు కుక్కలకు కోట్లాది రూపాయల విలువైన ఆస్తిని రాసిచ్చాడు

మిథున్ చక్రవర్తి – బాలీవుడ్‌కు ఓ లెజెండరీ నటుడు
1980లలో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన నటుల్లో మిథున్ చక్రవర్తి ఒకరు. వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ‘డిస్కో డాన్సర్’ లాంటి సూపర్‌హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఎంతో కష్టపడి పేద కుటుంబం నుంచి ఎదిగి, బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. అయితే, ఆయనకు కుక్కలు అంటే ఎంతగా ఇష్టమో తెలుసా? మిథున్ చిన్నతనంలో చాలా పేదరికాన్ని అనుభవించాడు. చిన్నతనంలోనే తనకు ఓ పెంపుడు కుక్క ఉండేది. దానిపై ప్రేమ అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో తన పెంపుడు జంతువుకు సరైన ఆహారం ఇవ్వలేకపోయిన విషాదం మిథున్ మదిలో చెరిగిపోలేదు. ఇప్పుడు తన సంపదలో కొంత భాగాన్ని కుక్కల సంక్షేమం కోసం కేటాయించాలనే నిర్ణయానికి రావడం అందుకే అని చెప్పొచ్చు.
116 కుక్కలను పెంచుతున్న మిథున్
మిథున్ చక్రవర్తికి కుక్కలు అంటే ఎనలేని ప్రేమ. ఆయన ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 116 పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు. ఇవన్నీ ఆయన ఫామ్ హౌస్‌లో ఉంటాయి. మిథున్ తన కోడలు ఈ విషయాన్ని బయటపెట్టారు. మా మామగారికి కుక్కలు అంటే అమితమైన ప్రేమ. వీటి కోసం ప్రత్యేకమైన ఫామ్ హౌస్ నిర్మించి, వాటికి లగ్జరీ లైఫ్ అందిస్తున్నారు. అని చెప్పారు పెంపుడు జంతువులంటే ఇష్టపడే వారిలో చాలామంది వాటికి ప్రత్యేకమైన ఇళ్లు, మంచి ఆహారం అందిస్తారు. కానీ, మిథున్ చక్రవర్తి ఏకంగా 45 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్‌ను తన పెంపుడు కుక్కల కోసం కట్టించారు. కేవలం ఫామ్ హౌస్ మాత్రమే కాదు, వాటికి ప్రత్యేకమైన గదులు, అత్యున్నతమైన వైద్యం, శుభ్రత కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా, వాటికి తన ఆస్తిలో ఒక భాగం కేటాయిస్తూ లీగల్ డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసారు.
కుక్కల కోసం లగ్జరీ లైఫ్
మిథున్ చక్రవర్తి తన కుక్కలను పిల్లల్లా చూసుకుంటారు. వాటి ఆరోగ్యాన్ని ప్రతినిత్యం చెక్ చేస్తుంటారు. వీటికి మంచి డైట్ ప్లాన్ ఉండేలా చూసుకుంటారు. వేటికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ప్రత్యేక వెటరినరీ డాక్టర్ల సేవలు అందుబాటులో ఉంచుతారు. కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా ప్రత్యేకమైన పార్క్, కుక్కల కోసం స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఈ ఫామ్ హౌస్‌లో ఉన్నాయి. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు కూడా మిథున్‌పై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కొందరు, ఇది నిజమైన ప్రేమ అని అంటుంటే, మరికొందరు, ఇదేం అవసరం? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, పెంపుడు జంతువుల్ని ప్రేమించే వ్యక్తులకు మాత్రం మిథున్ నిర్ణయం హృదయానికి హత్తుకునేలా ఉంది. ఆయన కుక్కల గురించి చూపించే శ్రద్ధ నిజంగా ఆశ్చర్యకరమే.
కుటుంబ సభ్యులు షాక్
ఈ విషయం బయటకు రావడంతో మిథున్ కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. అంతేకాకుండా అభిమానులు కూడా ఈ విషయంపై తమదైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది అతిగా ఉందనుకుంటుంటే, మరికొందరు పెంపుడు జంతువులపై ప్రేమ ఇంత గొప్పగా ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కోడలు మాట్లాడుతూ, తన కుక్కలను మామగారు కంటికి రెప్పలా చూసుకుంటారు. అవి అనారోగ్యంగా ఉంటే ఆయన నిద్రపోరు. ఇంట్లో ఉన్న పిల్లలకన్నా కుక్కలపైనే ఎక్కువ శ్రద్ధ వహిస్తారు అని చెప్పారు.
మిథున్ చక్రవర్తి తన పెంపుడు కుక్కలపై చూపించిన ప్రేమ నిజంగా ప్రత్యేకమైనది. 116 కుక్కలకు 45 కోట్ల విలువైన ఫామ్ హౌస్ కట్టించడం, వాటికి ప్రత్యేకమైన లైఫ్‌స్టైల్ అందించడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే, ఇది పెంపుడు జంతువుల ప్రేమికులకు ఒక గొప్ప సందేశం కూడా. “పెంపుడు జంతువులు మనకు మాటలు చెప్పలేవు, కానీ అవి మన ప్రేమను పూర్తిగా అర్థం చేసుకుంటాయి” అనే మాటను మిథున్ మరోసారి నిజం చేశాడు.