భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ (Dilwale Dulhania Le Jayenge) చిత్రం విడుదలై ఇటీవలే 30 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలైన రాజ్ (షారుఖ్ ఖాన్), సిమ్రాన్ (కాజోల్) ల కాంస్య విగ్రహాన్ని లండన్‌లోని ప్రఖ్యాత లీసెస్టర్ స్క్వేర్ లో, ఆవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన షారుఖ్ ఖాన్, కాజోల్ తమ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా తమ ఐకానిక్ ఫొజులతో వైరల్‌గా నిలిచారు.
Read Also: Bigg Boss 9: ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్
చారిత్రాత్మక చిత్రాలలోని ఐకానిక్ పాత్రలు
లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌లో విగ్రహంతో సత్కరించబడిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఈ కాంస్య విగ్రహం నిలిచింది. హ్యారీ పాటర్, మేరీ పాపిన్స్, పాడింగ్టన్, సింగింగ్ ఇన్ ది రెయిన్ వంటి చారిత్రాత్మక చిత్రాలలోని ఐకానిక్ పాత్రలతో పాటు బ్యాట్‌మ్యాన్, వండర్ ఉమెన్ వంటి పాపులర్ రోల్స్ పక్కన షారుఖ్, కాజోల్ విగ్రహం చేరింది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) మాట్లాడుతూ.. “DDLJ స్వచ్ఛమైన హృదయంతో తెరకెక్కించారు.

ప్రేమ అడ్డంకులను ఎలా దాటుతుంది.. ? ప్రేమ ఉంటే ప్రపంచం ఎలా మెరుగ్గా ఉంటుందో అనే దాని గురించి మేము ఒక కథను చెప్పాలనుకున్నాము. అందుకే DDLJ 30 సంవత్సరాలకు పైగా శాశ్వత ప్రభావాన్ని చూపిందని నేను భావిస్తున్నాను!
ఈ సినిమా 30 ఏళ్లు పురస్కరించుకుని ఇంతటి గొప్ప అనుభూతిని కలిగించినందుకు యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజలకు, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్‌కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐకానిక్ సీన్స్ ఇన్ ది స్క్వేర్ ట్రైల్‌లో గౌరవించబడిన మొదటి భారతీయ చిత్రంగా DDLJ ని చూడటం ఒక భావోద్వేగ క్షణం, ఇది చాలా జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది” అని అన్నారు షారుఖ్ ఖాన్ (Shahrukh Khan).
షారుక్ ఖాన్ – కాజోల్ కలిసి నటించిన మొదటి సినిమా ఏది?
షారుక్ ఖాన్, కాజోల్ కలిసి నటించిన మొదటి సినిమా “బాజీగర్” (Baazigar – 1993).
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: