ప్రపంచానికి మధురమైన సంగీతాన్ని అందించిన ఆస్కార్ అవార్డు గ్రహీత, భారతీయ గర్వకారణంగా నిలిచిన ఏఆర్ రెహమాన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన భార్య సైరా బానుతో 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు ప్రకటించడంతో సంగీత ప్రపంచం కాకుండా ప్రజలలోనూ ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ ప్రకటన తర్వాత కొందరు సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్‌లతో స్పందించడం ప్రారంభించారు.

రెహమాన్ మాటలు:
తాజాగా ఈ విమర్శలపై రెహమాన్ స్పందిస్తూ ఒక గొప్ప సందేశాన్ని అందించారు. సెలబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వారి జీవితాల్లో ఏం జరుగుతుందో పరిశీలిస్తుంటారు. ఇక విమర్శలు సర్వసాధారాణం. వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను కూడా అంతే నా గురించి తప్పుగా మాట్లాడేవారిని కూడా నా కుటుంబ సభ్యులే అనుకుంటాను. నేను ఒకరి గురించి తప్పుగా మాట్లాడితే నా గురించి మరొకరు మాట్లాడుతారు. నా ఫ్యామిలీని ఎవరైనా విమర్శిస్తే నేను బాధపడతాను. అలాగే ఇతరులకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా అందుకే నేను ఎప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడను. వారందరినీ సరైన మార్గంలో నడిపించమని దేవుడిని ప్రార్థిస్తాను అని రెహమాన్ చెప్పుకొచ్చారు. విమర్శల నుంచి ఎవరూ తప్పించుకోలేరు” అని ఆయన చెప్పిన మాట తన జీవిత అనుభవం మీద ఆధారపడి ఉంది. రెహమాన్ జీవితాన్ని అత్యంత రహస్యంగా, గౌరవంగా కొనసాగిస్తూ వచ్చారు. విమర్శల నుంచి ఎవరూ తప్పించుకోలేరు” అని ఆయన చెప్పిన మాట తన జీవిత అనుభవం మీద ఆధారపడి ఉంది. రెహమాన్ జీవితాన్ని అత్యంత రహస్యంగా, గౌరవంగా కొనసాగిస్తూ వచ్చారు.
Read also: Imanvi Esmail: సోషల్ మీడియా ట్రోలర్లకు గట్టిగా బుద్ది చెప్పిన ఇమాన్వీ