కన్నడ సినిమాలు ఈ మధ్య నిజంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పెద్ద హీరోలు లేకపోయినా, భారీ బడ్జెట్ అవసరం లేకుండానే బ్లాక్‌బస్టర్లు వస్తున్నాయి. వాటిల్లో ‘కాంతార’ తర్వాత ఇప్పుడు ‘సు ఫ్రమ్ సో’ (Su From So) దూసుకెళ్తోంది.ఈ సినిమాకు గట్టి ప్రమోషన్స్ ఎక్కడా కనపడలేదు. మాస్ ఆడియో రిలీజ్, ట్రైలర్ లాంచ్, ఇంటర్వ్యూలు ఏమీ చేయలేదు. అయినా జులై 25న థియేటర్లలో విడుదలై విజయం సాధించింది.ఈ సినిమాను కేవలం రూ.5.5 కోట్ల బడ్జెట్‌తో తీశారు. కానీ ఇప్పటివరకు రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు (Collections of over Rs. 80 crores) వచ్చాయి. ఇది తక్కువ బడ్జెట్ సినిమాలకు భారీ ప్రేరణగా మారింది.దర్శకుడు జేపీ తుమినాడ్ కథ చెప్పే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. రియలిస్టిక్ టోన్, లోకల్ స్టోరీటెల్లింగ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

కథలోని మేజిక్ ఏంటంటే…
కథలో హీరో ఒక తప్పు చేస్తాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి “నాకు దెయ్యం పట్టింది” అని అబద్ధం చెబుతాడు. ఆ అబద్ధం అతనికి ఎంత పెద్ద ప్రమాదంగా మారుతుందో అదే కథ.ఈ సినిమా కథ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. అక్కడి భాష, జీవితశైలి, నమ్మకాలను నెమ్మదిగా కథలో నిక్షిప్తం చేశారు. అందుకే ఇది విభిన్నంగా అనిపించింది.కంటెంట్ బాగుంటేనే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించింది. ఈ సినిమా చూసినవారు ఎమోషన్స్, హ్యూమర్‌కి బ్రావో అంటున్నారు.
మౌత్ టాక్‌తో ఎగిసిపడిన వసూళ్లు
మొదటి వారం తర్వాత ఈ సినిమా వసూళ్లు రెట్టింపయ్యాయి. సోషల్ మీడియా రివ్యూలు, నోటిమాట ప్రచారం బాగా పనిచేశాయి.ఇంతటి హిట్ తర్వాత ఇప్పుడు అందరూ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు డిజిటల్ హక్కులు సొంతం చేసుకుంది.ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటివారంలో ప్రైమ్‌లో రానుంది. అయితే అధికారికంగా తేదీ ప్రకటించాల్సి ఉంది.ఈ సినిమాలో పెద్ద హీరోలు లేరు. కానీ కథే హీరోలా నిలిచింది. మంచి కథకు ప్రేక్షకుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని నిరూపించింది.
Read Also : YS Jagan : ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ పోలింగ్