ఈ సంవత్సరంలో (2025 Movies) ఎన్నో సూపర్ హిట్ సినిమాలు విడుదలై సంచలన విజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి కూడా.. ఇక ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సర్చ్ చేసిన సినిమాలు (2025 Movies) ఏవో తెలుసా? ఎక్కువగా మంది కొన్ని సినిమాల గురించి గూగుల్ లో ఈ సంవత్సరంలో సర్చ్ చేసారు. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.
Read Also: Samantha: సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది: రాజ్ పిన్ని
Kantara Chapter 1

రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార2 కూడా భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా ఏకంగా రూ. 800కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను నెటిజన్స్ ఎక్కువగా 2025లో గూగుల్ లో గాలించారు.
Coolie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కూడా నెటిజన్స్ గూగుల్ ల్లో ఎక్కువ మంది గాలించారు.
War 2..

బాలీవుడ్ మూవీ వార్ 2, హృతిక్ రోషన్ తో కలిసి తారక్ నటించిన ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను కూడా ఎక్కువమంది గూగుల్ లో సర్చ్ చేశారు.
Mahavatar Narasimha..

ఈ ఏడాది విడుదలైన భారీ హిట్ సినిమాల్లో మహావతార్ సినిమా ఒకటి. ఈ యానిమేటడ్ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోపాటు సనమ్ తేరీ కసమ్, సైయారా, మార్కో, గేమ్ చేంజర్ సినిమాలను ఎక్కువమంది గూగుల్ లో సర్చ్ చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: