తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పొట్టేల్ సినిమా ఇప్పుడు రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా,తన ప్రత్యేకమైన కథనంతో థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నించింది.అయితే,ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంపై దృష్టి పెట్టింది. పొట్టేల్ సినిమా నేడు (డిసెంబర్ 20) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది.ఆసక్తికరంగా, ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా సడెన్‌గా స్ట్రీమింగ్‌కు రావడం గమనార్హం.ఇప్పుడు, రెండు ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయవచ్చు. పొట్టేల్ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో విడుదలైంది.ఆరంభంలో ట్రైలర్, టీజర్ ద్వారా మంచి హైప్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ఈ సినిమా ఓటీటీలోకి రాక కోసం రెండు నెలల సమయం పట్టింది.ఇంత ఆలస్యమైనా, ఇప్పుడు రెండు ప్రధాన ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంది.పొట్టేల్ సినిమాకు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు.1980ల గ్రామీణ పరిస్థితులను అద్దం పట్టే ఈ చిత్రం, ఒక తండ్రి తన కూతురి చదువుకి ప్రయత్నించే ప్రయత్నాలను హృదయానికి హత్తుకునేలా చిత్రించింది.కథనంలో గొర్రెలను బలి ఇవ్వాలనుకోవడం, వాటి తప్పిపోవడం, ఆ వెతకటంలో ఎదురయ్యే సంఘటనలు ప్రధానంగా ఉంటాయి.యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్లతో పాటు అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్, మరియు ప్రియాంక శర్మ లాంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. వారి నటనకు మంచి ప్రశంసలు దక్కినప్పటికీ, స్క్రీన్‌ప్లే విషయంలో కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. రొటీన్ సన్నివేశాలు మరియు నెమ్మదిగా సాగిన కథనం చిత్ర విజయానికి ప్రతికూలంగా మారింది.