హాలీవుడ్ నటి, మోడల్, డాన్సర్ సిండ్యానా శాంటాంజెలో (58) ఆకస్మికంగా మరణించారు. ఆమె నివాసంలో మెడికల్ ఎమర్జెన్సీ సంభవించడంతో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు.
అనుమానాస్పద పరిస్థితులు
శాంటాంజెలో ఇటీవల కాస్మెటిక్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే, వాటి ప్రభావం వల్లే మరణం సంభవించిందా అనే అంశంపై స్పష్టత లేదు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ షెరీఫ్ విభాగం ఈ మరణాన్ని దర్యాప్తు చేస్తోంది.

శాంతాంజెలో సినీ ప్రస్థానం
మొదట నర్తకిగా కెరీర్ ప్రారంభించిన శాంటాంజెలో, ప్రముఖ MTV మ్యూజిక్ వీడియోలలో నటించి గుర్తింపు పొందారు. ఆమె Married With Children, ER, CSI: Miami వంటి షోలలో నటించారు.
అభిమానుల సంతాపం
ఆమె మరణం పట్ల అభిమానులు, స్నేహితులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. ఆమె జీవితాన్ని స్మరించుకుంటూ మిత్రులు భావోద్వేగ పోస్టులు షేర్ చేస్తున్నారు.