CID should investigate comprehensive family survey.. Shabbir Ali

కుటుంబ సర్వేపై విచారణ జరిపించాలి : షబ్బీర్ అలీ

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆనాడు టీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ ద్వారా విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. సర్వే కోసం కేటాయించిన రూ.100 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని లేఖలో ఆరోపించారు.

image

దీనిపై దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు 4 లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారని షబ్బీర్ అలీ వివరించారు. ప్రజల ఆధార్, రేషన్ కార్డు వివరాలు, బ్యాంకు సమాచారం, ఎల్‌పీజీ కనెక్షన్లు, వాహన రిజిస్ట్రేషన్ల సమాచారం, ఇతర వ్యక్తిగత వివరాలతో కూడిన 94 అంశాల సమాచారాన్ని సేకరించారని గుర్తుచేశారు. కానీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడూ వాటి వివరాలు బయట పెట్టలేదని, ప్రజల సున్నితమైన సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు విక్రయించినట్లు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు.

Related Posts
బడ్జెట్ లో ఏ రంగానికి ఎంతెంత!
nirmala

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీయే కూటమి సభ్యుల హర్షధ్వనాల మధ్య పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో రికార్డు స్థాయి బడ్జెట్ ను Read more

ఐస్లాండ్‌లో అగ్నిపర్వతం పది సార్లు విస్ఫోటనం: ఆందోళన చెందుతున్న ప్రజలు
volcano

ఐస్లాండ్‌లోని "రేక్‌జావిక్‌" ప్రాంతంలో ఉన్న ఒక అగ్నిపర్వతం ఒక సంవత్సరంలో ఏడవసారి మరియు మూడు సంవత్సరాలలో పది సార్లు విస్ఫోటించింది. ఈ విస్ఫోటనం భారీగా జరిగి అందరి Read more

అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో దాడి
Amritsar Golden Temple

పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేయడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడగా, Read more

ఢిల్లీలో తీవ్ర కాలుష్యం: వాయు నాణ్యత 49 సిగరెట్ల పొగతో సమానం..
smoking

ఢిల్లీ నగరం సోమవారం ఉదయం తీవ్ర పొగతో కమ్ముకొని పోయింది.. వాయు నాణ్యత సూచిక (AQI) అనేక ప్రాంతాల్లో 1,500ని దాటింది. దీంతో, అధికారులు "గ్రేడెడ్ రెస్పాన్స్ Read more