CID should investigate comprehensive family survey.. Shabbir Ali

కుటుంబ సర్వేపై విచారణ జరిపించాలి : షబ్బీర్ అలీ

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆనాడు టీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ ద్వారా విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. సర్వే కోసం కేటాయించిన రూ.100 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని లేఖలో ఆరోపించారు.

image

దీనిపై దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు 4 లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారని షబ్బీర్ అలీ వివరించారు. ప్రజల ఆధార్, రేషన్ కార్డు వివరాలు, బ్యాంకు సమాచారం, ఎల్‌పీజీ కనెక్షన్లు, వాహన రిజిస్ట్రేషన్ల సమాచారం, ఇతర వ్యక్తిగత వివరాలతో కూడిన 94 అంశాల సమాచారాన్ని సేకరించారని గుర్తుచేశారు. కానీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడూ వాటి వివరాలు బయట పెట్టలేదని, ప్రజల సున్నితమైన సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు విక్రయించినట్లు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు.

Related Posts
అది ఓ మతతత్వ పార్టీ : కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
It is a religious party. Konda Surekha key comments

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ బీజేపీ పై విమర్శలు గుప్పించారు. విభజించి పాలించే మనస్తత్వం బీజేపీదని.. అది ఓ మతతత్వ పార్టీ కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు Read more

ప్రతీ అడుగులో ప్రమాదం: UKకి చేరుకోవాలనుకున్న అఫ్ఘన్ల సాహసం
afghans

ఆఫ్ఘనిస్తాన్ నివసిస్తున్న ప్రజలు, తమ ప్రస్తుత జీవన పరిస్థితుల నుండి బయట పడటానికి తీవ్రంగా పోరాడుతున్నారు. తమ ప్రాణాలను పడగొట్టి, ఆఫ్ఘనిస్తాన్ నుండి బ్రిటన్ (UK) కు Read more

జపాన్ లో 6.4 తీవ్రతతో భూకంపం
Earthquake

జపాన్ లోని ఉత్తర-మధ్య నోటో ప్రాంతంలో 6.4 తీవ్రతతో ఒక బలమైన భూకంపం సంభవించింది. జపాన్ మీటియరొలాజికల్ ఏజెన్సీ ప్రకారం, ఈ భూకంపం నోటో ద్వీప ప్రాంతం Read more

మళ్లీ ఇస్రో ‘స్పేడెక్స్‌’వాయిదా..
ISRO Postpones Space Docking Experiment Again

బెంగళూరు : ఇస్రో చేపట్టిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌(స్పేడెక్స్‌)కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. గురువారం అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం(డాకింగ్‌) చేయాలని ఇస్రో భావించింది. ఇందుకోసం రెండు ఉపగ్రహాలను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *