Chittoor: చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్యకి బలైన నవవధువు

Chittoor: చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్యకి బలైన నవవధువు

ప్రేమను సహించలేక పరువు హత్యకే పాల్పడ్డారా?

ప్రేమ, ఓ యవతి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. మతాంతర వివాహం చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులే చంపినట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుండి చిత్తూరు జిల్లాలో పెద్ద గందరగోళం మొదలైంది. ఇది ఒక సాధారణ మరణం కాదు.. ఓ అమాయకమైన భార్యపై జరిగిన అతి దారుణమైన కుట్ర. యాస్మిన్‌బాను అనే 26 ఏళ్ల యువతి, స్థానిక బాలాజీ నగర్‌కు చెందిన అమ్మాయి. ఎంబీఏ పూర్తిచేసిన ఈ యువతి, తన కాలేజ్ రోజులలో సాయితేజ్ అనే బీటెక్ విద్యార్థితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, చివరకు ఆమె అతనితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే మతం భిన్నంగా ఉండటం, కులం కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఈ వివాహాన్ని ఒప్పుకోలేదు. అయినా సరే, ప్రేమను పెళ్లిగా మలచాలని నిర్ణయించుకున్న ఈ జంట, ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు.

Advertisements

ప్రాణహాని భయంతో పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

వివాహానంతరం తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని భావించిన యాస్మిన్, తన భర్త సాయితేజ్‌తో కలిసి తిరుపతి డీఎస్పీని కలిశారు. తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలంటూ వినతి పత్రం ఇచ్చారు. పోలీసులు ఇరుపక్షాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినా, వారి ఉద్దేశాలు మారలేదు. కొన్ని రోజులు గడిచాక, తండ్రి షౌకత్ అలీ ఆరోగ్యం బాగోలేదని చెప్పి, ఇంటికి రావాలని యాస్మిన్‌ను పలుమార్లు ఒత్తిడి చేశారు. తన తండ్రిని చూసి వస్తానని భావించి, ఆదివారం ఉదయం భర్త సాయితేజ్‌తో కలిసి ఆమె చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్దకు వచ్చారు. అక్కడ ఆమె సోదరుడి కారులో ఎక్కి తల్లిగారింటికి వెళ్లిపోయింది.

ఇంటికెళ్లిన కొద్ది సేపటికే మృతదేహంగా మారిన యాస్మిన్

ఆమె వెళ్లిన కొద్ది సేపటికే సాయితేజ్ తన భార్యకు ఫోన్ చేసాడు. కానీ ఫోన్ అందకపోవడంతో అనుమానం వచ్చి నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె ఇంట్లో లేదని, ఆత్మహత్య చేసుకుందని, మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తీవ్ర ఆందోళనతో ఆసుపత్రికి వెళ్లిన సాయితేజ్ తన భార్య మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. తాను ప్రాణంతో ఉన్న భార్యను పంపితే, ఇలా మృతదేహంగా ఎలా మారింది? ఇది స్పష్టంగా పథకం ప్రకారం చేసిన హత్యేనని, తన భార్యను ఆమె తల్లిదండ్రులే చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశాడు.

అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు

పోలీసులు యాస్మిన్ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె తండ్రి షౌకత్ అలీ, పెద్దమ్మ కొడుకు లాలూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరిద్దరినీ పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మతాంతర వివాహం, పరువు కోసం జరిగిన హత్యల నేపథ్యంలో ఈ కేసు మరింత తీవ్రతరం అవుతుంది. ఆ యువతిని కాపాడేందుకు ఎవ్వరూ కృషి చేయలేకపోయిన దుఃఖం ప్రజల మనసులో తీవ్ర బాధను కలిగిస్తోంది.

READ ALSO: Murder: గర్భిణీ భార్యని హతమార్చిన భర్త

Related Posts
కేసీఆర్ కు కిషన్ రెడ్డి పార్ట్నర్ – సీఎం రేవంత్
kcr kishan revanth

తెలంగాణలో రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. "కేసీఆర్ కోసం కిషన్ రెడ్డి Read more

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : బండి సంజయ్
The government should keep its promise.. Bandi Sanjay

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి అంటే మహిళా దినోత్సవం రోజు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడం కాదని, ఆచరణలో చూపి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని Read more

14న ఢిల్లీకి సీఎం రేవంత్.. అక్కడి నుంచే విదేశాలకు
revanth delhi

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14న సాయంత్రం ఢిల్లీకి పయనమవుతున్నారు. అక్కడ 15న ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ Read more

టాటా ఏస్ EV ఫ్లీట్‌తో లాస్ట్-మైల్ డెలివరీని విప్లవాత్మకంగా మారుస్తున్న గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ
Green drive mobility revolutionizing last mile delivery with Tata Ace EV fleet

హైదరాబాద్ : సుస్థిరమైన అర్బన్ లాజిస్టిక్స్ వైపు గణనీయమైన పురోగతితో, గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ భారతదేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవంలో కీలకపాత్ర పోషిస్తూ.. అగ్ర ఆటగాళ్లలో ఒకటిగా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×