వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి..తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం‘ అంటూ సంక్రాంతి రోజున వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వెంకటేష్ – ఐశ్వర్య – మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు.
అనిల్ రావిపూడి సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ అని తెలిసిందే. ఈ సినిమా కూడా అంతే చిన్న పాయింట్ ని తీసుకొని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ సత్య ఆకెళ్ళ రావడం, అతన్ని కిడ్నాప్ చేయడం, YD రాజు, అతని భార్య, పిల్లలతో లైఫ్, మీనాక్షి రాజుని వెతుక్కుంటూ రావడం, ఆపరేషన్ గురించి సీఎంని కలవడంతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఓ పక్క భార్య మరో పక్క మాజీ ప్రేయసి మధ్య రాజు ఎలా నలిగిపోయాడు చూపిస్తూనే సత్యని ఎలా కాపాడుకున్నారు అని చూపించారు.
ఫస్ట్ హాఫ్ ఎక్కడా ల్యాగ్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అదిరిపోయే సాంగ్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ పెద్ద ట్విస్ట్ లు ఏమి లేకుండా సింపుల్ గానే సెట్ చేసారు. ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఇప్పుడు అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలు అనిల్ తో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారు. తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. కాగా మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పారు. చిరు ఒప్పుకుంటే ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి క్యారెక్టర్ రాస్తానని తెలిపారు. ఇదే నిజమైతే వింటేజ్ చిరంజీవిని చూస్తామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.