మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యం – ఆసుపత్రిలో చేరిక

మెగాస్టార్:అస్వస్థతకు గురైన చిరంజీవి తల్లి

అస్వస్థతకు గురైన చిరంజీవి తల్లి

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు మెగా కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి

అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన అధికారులతో నిర్వహించాల్సిన సమీక్షలను కూడా వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

అంజనాదేవి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఇటీవలే చిరంజీవి కుటుంబం ఆమె జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts
అల్లు అర్జున్ కు అండగా నాని
Nani Allu Arjun

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడంపై పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై న్యాచురల్ స్టార్ Read more

జెనీవా సమావేశంలో పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్పందన
జెనీవా సమావేశంలో పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్పందన

జెనీవాలో జరిగిన UN మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ జమ్మూ & కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం భారతదేశం తీవ్రంగా తప్పుబట్టింది. భారతదేశం ఈ ఆరోపణలకు దీటుగా Read more

అంతర్జాతీయ విలేకరుల దినోత్సవం: సత్యం, ధైర్యం, అంకితభావానికి గౌరవం!
Journalist day

ప్రతిభావంతుల విలేకరుల సేవలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 19న "అంతర్జాతీయ విలేకరుల దినోత్సవం" జరుపుకుంటాం. ఈ రోజు, తమ విధులను నిర్వర్తించేప్పుడు ప్రాణాలు పోయిన విలేకరులను Read more

నేటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు..శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
CBN tirumala

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 5 .45 గంటలకు మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *