చిరంజీవి తల్లికి అస్వస్థత హాస్పిటల్ లో చేరిక

చిరంజీవి తల్లికి అస్వస్థత హాస్పిటల్ లో చేరిక

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఈ విషయంపై మెగా కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.ఈ వార్త తెలిసిన వెంటనే అంజనాదేవిని పరామర్శించేందుకు మెగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో ఈ రోజు కార్యక్రమాలను, అధికారులతో సమీక్షలను రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, అంజనాదేవి అనారోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంజనాదేవి అనారోగ్యం నేపథ్యంలో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.ఇటీవల అంజనాదేవి పుట్టిన రోజు వేడుకను చిరంజీవి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements
FKPWQl9UYAIu5Qk

ఐదుగురు సంతానం

కొణిదెల అంజనా దేవికి ఐదుగురు సంతానం. చిరంజీవి,నాగబాబు,పవన్ కళ్యాణ్ ,విజయలక్ష్మి,మాధవి.మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి 1935లో జన్మించారు. ఆమె పూర్తి పేరు అంజనాదేవి కొణిదెల. చిరంజీవి తండ్రి వెంకటరావు, తల్లి అంజనాదేవి దంపతులకు చిరంజీవి సహా నాగబాబు, పవన్ కల్యాణ్, విజయ, మాధవి అనే పిల్లలు ఉన్నారు.అంజనాదేవి తన పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషించారు. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన ఆమె, పిల్లలకు మంచి విలువలు, ఆచారాలను నేర్పారు. చిరంజీవి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఆమె గొప్ప మద్దతుగా నిలిచారు.అంజనాదేవి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు ప్రార్థిస్తున్నారు.

హ్యాపీ బర్త్‌డే 

అమ్మా.ఈ ప్రత్యేకమైన రోజు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. నీ గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవు.నిన్ను ఎంత ప్రేమిస్తున్నామో చెప్పలేం.. నువ్వంటే మాకు ఎంత గౌరవమో నువ్వు కూడా ఊహించలేవు. హ్యాపీ బర్త్‌డే అమ్మ.. మన కుటుంబానికి నువ్వొక స్వీట్ హార్ట్. మా బలం నువ్వు.. స్వచ్ఛమైన ప్రేమ నువ్వు.. ఇట్లు నీ పాదాలకి నమస్కరిస్తూ పుణ్యం చేసుకొన్న నీ సంతతి.” అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు.

రెగ్యులర్ చెకప్

అయితే అంజనా దేవి రెగ్యులర్ చెకప్ కోసం హాస్పటల్ కు వెళ్లినట్టు పీఆర్ టీమ్ తెలిపింది. అంజనాదేవికి అస్వస్థత అనే వార్తలు ఒక్కసారిగా రావడంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు ఆమె కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పటల్ కు వెళ్లారు అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు మెగా ఫ్యాన్స్.

Related Posts
మళ్లీ అదరగొట్టేసిన విజయ్ సేతుపతి..
Vidudala 2 movie

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషా బేరయెరిగినప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు ఆయన. Read more

ఓటిటీ లోకి క్రైమ్ థ్రిల్లర్.
ఓటిటీ లోకి క్రైమ్ థ్రిల్లర్.

క్రైమ్ థ్రిల్లర్స్ అంటేనే ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఆకర్షణ,క్రేజ్‌ కారణంగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల రూపంలో కథానాయికలు, దర్శకులు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఎప్పుడూ సస్పెన్స్‌, మిస్టరీ, యాక్షన్‌ Read more

సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు
Sankranti holidays announced by Inter Board

హైరదాబాద్‌: తెలంగాణలో జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈమేరకు జనవరి 7న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈసారి మొత్తంగా ఇంటర్ కాలేజీలకు Read more

CM Revanth Reddy: ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy leaves for Delhi

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర మంత్రులు, బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీల అఖిలపక్ష Read more

×