chiru lokesh

మంత్రి లోకేష్ కు చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు

మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా రాజకీయ నేతలే కాదు ఇతర రంగాల వారు సైతం పెద్ద ఎత్తున లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. ”ప్రియమైన లోకేశ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించండి. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా” అని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Advertisements
lokesh bday
lokesh bday

అలాగే టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు. ఆయా నియోజకవర్గాల్లో కేక్‌ కటింగ్‌ చేసి, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.

Related Posts
ముంబయి 26/11 మారణ హోమానికి 16 ఏళ్లు..
16 years

మంబయి: దేశ ఆర్థిక రాజధానిలో మారణ హోమానికి 16 ఏళ్లు. 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారా మంబయిలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, Read more

రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్న.
రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్న.

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల'ఎక్స్' వేదికగా ఓ కీలకమైన ప్రశ్నను నిలిపారు.ఆయన అన్నారు,"సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఒక న్యాయం,కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మరో Read more

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయుల మృతి..!
Road accident in America. Five Indians died

అమెరికా: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. అమెరికాలోని రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన Read more

ఆన్‌లైన్ భద్రతకు ప్రమాదం: 78% పాస్‌వర్డ్స్ ఇప్పుడు 1 సెకన్లో క్రాక్ అవుతాయి!
password1

ప్రపంచవ్యాప్తంగా పాస్‌వర్డ్ భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు వెలుగు చూసాయి. తాజాగా, నార్డ్‌పాస్ (NordPass) అనే సంస్థ చేసిన ఒక అధ్యయనంలో, ‘123456’ పాస్‌వర్డ్ ఇండియాలో అతి Read more

×