Chiranjeevi యూకేలో అభిమానులతో చిరంజీవి సమావేశం

Chiranjeevi : యూకేలో అభిమానులతో చిరంజీవి సమావేశం

Chiranjeevi : యూకేలో అభిమానులతో చిరంజీవి సమావేశం తెలుగు చిత్రపరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు.ఈ సందర్బంగా ఆయనకు లండన్‌లో ఘనసన్మానం జరిగింది. ప్రముఖ సంస్థ ‘బ్రిడ్జ్ ఇండియా’ వారి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును చిరంజీవికి అందజేసి గౌరవించింది. ఈ పురస్కారం ఆయన సినీ సామాజిక సేవలను గుర్తించి ప్రదానం చేయడం విశేషం.ఈ ఘనతను సొంతం చేసుకున్న అనంతరం చిరంజీవి తన అభిమానులను కలవడం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.అక్కడ ఉన్న తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఆస్వాదిస్తూ వారితో ఉల్లాసంగా ముచ్చటించారు.తన అభిమానుల మధ్యకి వచ్చిన చిరంజీవి వారితో చాలా అనందంగా సంభాషించారు. తన అభిమానులకు ఆయన వ్యక్తిగతంగా ఎంతగా దగ్గరగా ఉంటారో ఈ సందర్భంగా మరోసారి రుజువైంది.”మీరంతా నా కుటుంబ సభ్యులే.మీలో ప్రతిఒక్కరూ సాధించే విజయం నాకూ గర్వకారణం.మీరు నా సినిమాలను చూసి స్పందించిన అనుభూతి నేను మర్చిపోలేను.

Chiranjeevi యూకేలో అభిమానులతో చిరంజీవి సమావేశం
Chiranjeevi యూకేలో అభిమానులతో చిరంజీవి సమావేశం

మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.నిజం చెప్పాలంటే మీ ఇంటికి వచ్చి మీ అతిథ్యాన్ని స్వీకరించాలని ఉంది. మీ చేతి వంట తినాలని ఉంది. వీలైనప్పుడు తప్పకుండా వస్తాను అని చిరంజీవి సంతోషంగా అన్నారు.ఈ మాటలు వినగానే అక్కడున్న అభిమానులు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు.చిరు తమ ఇంటికి వస్తే ఎంత బాగుంటుందో అంటూ తెగ సంబరపడిపోయారు.ఈ సందర్భంగా చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఒక విశేషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడిన మాటలను చిరు గుర్తు చేశారు.పవన్ ప్రమాణ స్వీకారానికి ముందు మోదీ గారు నన్ను సంప్రదించారు.పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను ఆయన్ని ఇంటికి పిలిచి ఆశీర్వదించిన తీరు చూసి ఆయనకి ఎంతో ఆనందంగా అనిపించిందట.అన్నదమ్ములు ఎలా ఉండాలో చిరంజీవి చూపించారని మోదీ గారు ప్రశంసించారు అని చిరంజీవి పేర్కొన్నారు.ఈ మాటలు వింటూనే అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్, చిరంజీవి మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేస్తూ పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు.

చిరంజీవి యూకే పర్యటన అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా మారింది. ఆయనకు లభించిన అంతర్జాతీయ గౌరవం, యూకే పార్లమెంట్‌లో జరిగిన సన్మానం తెలుగువారి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. చిరంజీవి అభిమానులను కలవడం, వారి ప్రేమను పంచుకోవడం ఎప్పుడూ ప్రత్యేకమే.ఇప్పుడు యూకే పర్యటనలోనూ అదే అనుభూతిని అభిమానులకు అందించారు.త్వరలోనే చిరు కొత్త ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ రావొచ్చనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

Related Posts
చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్
చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. అనూహ్యంగా ఆయనను టార్గెట్ చేసిన హిండెన్ బర్గ్ తన వ్యాపార కార్యకలాపాలను Read more

ఎన్నికలకు ముందు ఆప్ పార్టీకి షాక్
A shock to AAP before elections ED allowed to investigate Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను విచారించేందుకు Read more

NarendraModi : జర్మన్ గాయని కాస్మే పై ప్రధాని మోదీ ప్రశంసలు
NarendraModi : జర్మన్ గాయని కాస్మే పై ప్రధాని మోదీ ప్రశంసలు

జర్మనీకి చెందిన ప్రతిభాశాలి, గాయని కాస్మే (అసలు పేరు కాసాండ్రా మే స్పిట్‌మాన్) భారతీయ సంగీతాన్ని తన ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లలో పాడటం ద్వారా విపరీతమైన ప్రజాదరణ పొందారు. Read more

సరదాగా స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు: వీడియో వైరల్
సరదాగా స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు

చాలా మంది పిల్లలు తల కిందులుగా దూకుతుంటారు. సరదాగా గంతులేస్తూ.. తలకిందులుగా దూకుతూ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సరదా స్టంట్ చేయబోయి ఓ యువకుడు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *