చైనాలో మరోసారి కొత్త వైరస్ HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతున్నాయని, ఈ కేసులు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని సమాచారం. 2019లో కరోనా మహమ్మారి ప్రారంభమై ప్రపంచాన్ని కుదిపేసిన పరిస్థితి గుర్తుకు తెస్తూ, నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

HMPV వైరస్ శ్వాసకోశ సమస్యలను ప్రాథమిక లక్షణాలుగా చూపిస్తోంది. ఈ మహమ్మారి చైనాలో వేగంగా వ్యాప్తి చెందడంతో ఆరోగ్యశాఖలు అప్రమత్తమయ్యాయి. అయితే, ఈ వైరస్ వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దీని వ్యాప్తిని నియంత్రించకపోతే పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2019 డిసెంబర్‌లో చైనాలో కరోనా మహమ్మారి మొదలై మూడు నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది. అంతర్జాతీయంగా ప్రజల జీవనశైలిని మార్చేసిన ఈ వైరస్ మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అప్పటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం అన్ని చర్యలు ముందుగా చేపట్టాలని చెబుతున్నారు.
HMPV విస్తరణపై సమర్థవంతమైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే లాక్డౌన్ పరిస్థితులు మళ్లీ రావొచ్చని నిపుణులు అంటున్నారు. వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలి. వ్యాధి ప్రబలినప్పుడు సామాజిక దూరం, మాస్కుల వినియోగం వంటి ఆచరణా విధానాలు తప్పనిసరి అవుతాయి.
ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ఇప్పటినుంచే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశాల మధ్య ప్రయాణాలు, వాణిజ్య సంబంధాల వల్ల వైరస్ ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని దేశాలు సంయుక్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి విపత్తులను నివారించవచ్చు.