Chief Minister Chandrababu on Delhi tour

ఢిల్లీ పర్యటలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నిన్న(శుక్రవారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఇవ్వబోతున్న రుణాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా వచ్చేలా చూడాలని కోరినట్లు సమాచారం. అలాగే గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నేడు(శనివారం) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు.

నేడు మధ్యాహ్నం హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు. ఈ సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు థానే, భివండీ ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. రేపు(ఆదివారం) సియోన్ కొలివాడ, వర్లీ ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Related Posts
ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Bomb threat to Air India flight. Emergency landing

న్యూఢిల్లీ: ముంబయి నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్‌ విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని ఢిల్లీకి Read more

ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్?
employees

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గతంలో పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్దె Read more

ఇంటి పై కప్పు కూలి 5 గురు మృతి
ఇంటి పైకప్పు కూలి 5 గురు దుర్మరణం – పంజాబ్‌లో విషాదం!

పంజాబ్‌లోని ఓ గ్రామంలో జరిగిన భయంకర ప్రమాదం ఆ ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. ఓ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో, అందులో ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యులు Read more

ట్రంప్ వ్యాఖ్యలు నిజమే : వ్లాదిమిర్ పుతిన్
Trump comments are true: Vladimir Putin

మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు తాను సిద్ధంగా Read more