ఆర్థిక శాఖ

Department of Finance : ఆర్థిక శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

సమీక్షలో ఆర్థిక శాఖ స్థితిగతుల పరిశీలన
హైదరాబాద్, మార్చి 22 :- రాష్ట్ర ఆర్థిక శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మరో వారంలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని ఆర్థికశాఖ స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు.

కేంద్ర నిధుల సమీక్ష
కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రివ్యూ చేశారు. ముఖ్యంగా, కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు త్వరగా విడుదల అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

సకాలంలో నిధుల విడుదలకు చర్యలు
కేంద్ర పథకాల సమగ్ర వివరాలను సమర్పించి, ఆర్థికశాఖ ద్వారా నిధులు సకాలంలో విడుదల అయ్యేలా చూడాలని సూచించారు. మొత్తం 5 శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు వివరించగా, కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు నిధులు తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు
హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థికశాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్ హాజరయ్యారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Related Posts
ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు
new airport ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి, రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో డొమెస్టిక్ టెర్మినల్ ఏర్పాటు Read more

Assembly :అసెంబ్లీ కి రాని ఎమ్మెల్యే ల పై రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఆగ్రహం
Assembly :అసెంబ్లీ కి రాని ఎమ్మెల్యే ల పై రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా జీతం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తగా, తెలంగాణ సీఎం Read more

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండికి వాయిదా..
AP Assembly Sessions Postponed to Wednesday

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడింది. మొదటి రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం వెంటనే వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-2025 Read more

ఇంద్రకీలాద్రీ పై ఈ నెల 11నుంచి భవానీ దీక్షలు ప్రారంభం
Bhavani Deeksha will start from 11th of this month on Indrakeeladri

అమరావతి: భవానీ దీక్షలు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించబడతాయి. ఈ దీక్షలు భక్తి, శ్రద్ధతో అమ్మవారిని పూజించే పరమాధికమైన కార్యక్రమంగా ప్రసిద్ధి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *