పహల్గాం ఉగ్రదాడి వెనక దేశీయ ఉగ్రవాదులు ఉండొచ్చంటూ కాంగ్రెస్ నేత చిదంబరం (Chidambaram) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన చిదంబరం, పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఏం చేసిందన్నది బయటపెట్టేందుకు కేంద్రప్రభుత్వం విముఖత చూపిస్తోందని ఆరోపించారు. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించారా? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్న ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లేదన్నారు. వారు దేశీయ ఉగ్రవాదులే కావొచ్చన్న సందేహాలూ ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారని ఎలా అనుకుంటారు? దానికి ఆధారాలున్నాయా? అని కేంద్రాన్ని చిదంబరం (Chidambaram) ప్రశ్నించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ వైపు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం వెల్లడించడం లేదని చిదంబరం ఆరోపించారు.

ట్రంప్ ప్రటకనతో కేంద్రాన్ని విమర్శించిన చిదంబరం
భారత్-పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ప్రకటన కూడా తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ కేంద్రాన్ని విమర్శించారు.. చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్.. పహల్గాంపై చిదంబరం చేసిన వ్యాక్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. పాకిస్థాన్ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ మరోసారి 3 ప్రయత్నాలు చేసింది అని బీజేపీ నేత అమిత్ మాలవీయ (Amit Malviya) పేర్కొన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని మన భద్రతాదళాలు తిప్పికొట్టిన ప్రతిసారీ కాంగ్రెస్ నేతలు భారత ప్రతిపక్ష నాయకుల్లా కాకుండా ఇస్లామాబాద్ డిఫెన్స్ లాయర్లుగా మాట్లాడుతారు ఎందుకో? అని ప్రశ్నించారు. శత్రువును రక్షించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూనే ఉందని చిదంబరంపై అమిత్ మాలవియా మండిపడ్డారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) చైనా కమ్యూనిస్ట్ పార్టీతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు అవినీతితో కళంకితమయ్యారని విమర్శించారు. వారు దేశాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నారన్నారు. మోదీకి ఉన్న బయలమైన నాయకత్వాన్ని చూసి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదని ఎద్దేవా చేశారు. చిదంబరం వ్యాఖ్యలకు శివసేన యుబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా విమర్శించారు. దశాబ్దాలుగా ఇలాంటి ఉగ్రదాడులకు పాక్ పాల్పడుతోందని అనడానికి తమకు ఎలాంటి రుజువు అవసరం లేదన్నారు.
పీవీ చిదంబరం ఎవరు?
పళనియప్పన్ చిదంబరం (జననం 16 సెప్టెంబర్ 1945), పి. చిదంబరం అని సుపరిచితుడు, ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు న్యాయవాది, ప్రస్తుతం రాజ్యసభ పార్లమెంటు సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన 2017 నుండి 2018 వరకు హోం వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: War: గాజాలో కొనసాగుతున్న ఆకలి చావులు