తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో కోడి మాంసం వినియోగం మళ్లీ పెరుగుతోంది. ప్రజలు మళ్లీ నిర్భయంగా చికెన్ కొనుగోలు చేయడం ప్రారంభించడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో కోడి మాంసం ధరల్లో స్వల్పంగా పెరుగుదల నమోదవుతోంది.
తెలంగాణ లో చికెన్ ధర ఎంతంటే
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్కిన్లెస్ కోడి మాంసం కేజీ ధర రూ.240 నుంచి రూ.260 మధ్య పలుకుతోంది. గత వారంలో ఇది కేవలం రూ.230 వద్దే ఉండేది. హోటళ్లు, ఫ్యామిలీ ఫంక్షన్లు, ఇంటి వినియోగం ఇలా అన్ని కలిపి డిమాండ్ పెరగడంతో మార్కెట్ ధరలో ఈ మార్పు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

ఏపీలో కోడి మాంసం ధర ఎంతంటే
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి మాంసం ధర మరింతగా పెరిగింది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో స్కిన్లెస్ చికెన్ ధర కేజీకి రూ.270 నుంచి రూ.300 వరకు వెళ్లింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ధరల్లో కొంత తేడా కనిపిస్తున్నప్పటికీ, మొత్తంగా చూస్తే చికెన్ ధరలు మళ్లీ పెరిగే దిశగా సాగుతున్నాయి. ధరలపై కస్టమర్లు అవగాహనతో ఉండాలని, అవసరమైనప్పుడు మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.