ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో బుధవారం ఉదయం సంభవించిన ఘోర ఎదురుకాల్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.ఈ ఆపరేషన్‌లో 27 మంది మావోయిస్టులు మృతి (27 Maoists killed) చెందారు .ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు, అలియాస్ బసవరాజు, (వయస్సు 70) మృతి చెందడం ప్రత్యేకంగా నిలిచింది.ఈ ఘట్టంపై ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.భద్రతా బలగాలు చూపిన ధైర్యానికి, సాహసానికి భేషజం పలికారు. అమిత్ షా ట్వీట్ ద్వారా ఈ ఆపరేషన్ విషయాలను వెల్లడిస్తూ, ఇది నక్సలిజంపై పోరులో ఒక మైలురాయి అని పేర్కొన్నారు.

పోస్ట్‌ను ప్రధాని మోదీ రీట్వీట్ చేస్తూ భద్రతా బలగాలను
అంతేగాక, 2026 మార్చి 31 నాటికి దేశం మొత్తం నుంచి నక్సలిజాన్ని, పూర్తిగా నిర్మూలించేందుకు,(To completely eradicate Naxalism from the entire country by 31)మోదీ ప్రభుత్వం కట్టుబడిందని ఆయన స్పష్టం చేశారు.ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్‌ను ప్రధాని మోదీ రీట్వీట్( Prime Minister Modi retweeted) చేస్తూ భద్రతా బలగాలను అభినందించారు.మీరు సాధించిన విజయం గర్వకారణం.మావోయిజాన్ని రూట్‌గా తొలగించి ప్రజలకు శాంతి,అభివృద్ధి కలిగే జీవితం ఇవ్వడమే మా లక్ష్యం,” అని మోదీ అన్నారు.
31 మంది మావోయిస్టులు మృతి
ఈ ఆపరేషన్ మాధ్ అటవీ ప్రాంతంలో జరిగింది.పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అక్కడ గూడు కట్టుకున్నారని ఖచ్చితమైన సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు ముందడుగు వేశాయి.బీజాపూర్, నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) బలగాలు ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.ఇదే సమయంలో, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట పర్వత ప్రాంతంలో ఇటీవల జరిగిన మరో పెద్ద ఆపరేషన్‌ను గుర్తు చేసుకో అక్కడ 24 రోజుల పాటు సాగిన ఆ ఆపరేషన్‌లో 16 మంది మహిళా మావోయిస్టులతో కలిపి మొత్తం 31 మంది మావోయిస్టులు మృతి చెందారు.
మావోయిస్టుల ప్రభావం
ఇలాంటి వరుస చర్యలతో మావోయిస్టుల ప్రభావం క్రమంగా క్షీణించుతున్నట్లు స్పష్టమవుతోంది.భద్రతా బలగాల దాడులు మరింత ఉధృతం కావడం చూస్తే, నక్సలిజానికి రోజులే మిగిలి ఉన్నాయనిపిస్తోంది.దేశ భద్రత, శాంతికి ఇదొక కీలక మలుపు.ప్రభుత్వం తీసుకుంటున్న దూకుడైన చర్యలు, భద్రతా బలగాల పట్టుదల దేశ ప్రజలకు భరోసానిస్తున్నాయి.ఇక నక్సలిజం చరిత్రలోకి మారే రోజు దగ్గర పడిందన్న విశ్వాసం ప్రజల్లో పెరుగుతోంది.
Read Also : Bangalore : బెంగళూరులో సూట్ కేసులో మైనర్ బాలిక మృతదేహం