Chevireddy Bhaskar Reddy will be accused in the High Court.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. !

అమరావతి : వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు తిరుపతి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో తాజాగా శుక్రవారం కోర్టు చెవిరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisements

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడంతో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం చేశారన్న ఆరోపణలతో చెవిరెడ్డిపై కేసు నమోదైంది. వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారం చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు పెట్టారు.

ఇదిలా ఉండగా, గతంలో ఓ బాలిక విషయంలో చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా తిరుపతి పోలీసులు ఆయనపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బాలిక తండ్రి చెప్పినా.. గతంలో ఇచ్చిన వాంగ్మూలం రికార్డు చేశారు. దీంతో ఆయనపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆయన తరఫున లాయర్స్ వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

Related Posts
బందీలను విడిచిపెట్టండి.. హమాస్‌కు ట్రంప్ హెచ్చరిక
Release the hostages. Trumps warning to Hamas

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ గాజా ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి బందీలను విడిపెట్టాలని, లేదంటే Read more

కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), Read more

రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Srivari Arjitha Seva tickets will be released tomorrow

తిరుమల: రేపు (బుధవారం) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. భక్తుల సౌకర్యార్థం 2025 మార్చి నెలకు సంబంధించిన సుప్రభాతం, Read more

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీగా వస్తున్నభక్తులు
శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీగా వస్తున్నభక్తులు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: ఏడో రోజు ఉత్సవాల ఘనత శ్రీశైలము లోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అద్భుతంగా సాగుతున్నాయి. ఈ మహా ఉత్సవాలు ప్రతి ఏడాదీ Read more

×