ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక లెజెండరీ టీం కానీ ఈ సీజన్ మాత్రం వాళ్లకు కలిసిరావడం లేదు.తమ సొంతగడ్డపై కూడా విజయాలు కొరతగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది సీఎస్కే.184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పూర్తిగా విఫలమైంది.ఛేజింగ్‌లో చెన్నై ఓపెనర్ల నుంచే వైఫల్యం మొదలైంది.రచిన్ రవీంద్ర 3 పరుగులకే వెనుదిరిగాడు.డెవాన్ కాన్వే 13 పరుగులు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 5 పరుగులకే ఔట్ అయ్యాడు.మధ్యలో శివమ్ దూబే (18) కొంత నమ్మకాన్ని చూపినా, రవీంద్ర జడేజా మాత్రం నిరాశపరిచాడు.విజయ్ శంకర్ 69 పరుగులు చేశాడు, ధోనీ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.కానీ ఇద్దరూ వేగంగా ఆడలేకపోయారు.పెరిగిన రన్ రేట్‌ను సమర్థంగా తట్టుకోలేకపోయారు.భారీ షాట్లు లేకపోవడం, స్ట్రైక్ రోటేట్ చేయడంలో జాప్యం ఓటమికి కారణమైంది.ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది.

వారి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ చక్కగా ఆడింది.చెన్నై బౌలర్లు ఒక్కో వికెట్ తీసినప్పటికీ, పరుగుల పరంగా ఒత్తిడి తేవలేకపోయారు.బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్ రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, మహేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఢిల్లీకి ఇది వరుసగా మూడో గెలుపు కావడం గమనార్హం.దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది.ఇప్పటివరకు చెన్నై ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది.ఇది అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది.గతంలో ఏ దశలోనైనా పోరాటం చూపించిన చెన్నై, ఈసారి మాత్రం అదృశ్యమవుతోంది.ఐపీఎల్‌లో నేడు డబుల్ హెడర్. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి.ఛండీగఢ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.
READ ALSO : Himalayan Flying : 30 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన జాతి : ఎగిరే ఉడుత