భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తింటున్న ఆహారాల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వులకు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది. వీటిని ఎంతో కాలం నుంచి ఆహారంగా తింటున్నారు. నువ్వులతో అనేక రకాల వంటకాలను తయారు చేస్తుంటారు. నువ్వులతో తయారు చేసే తీపి వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. నువ్వుల్లో
(Sesame Seeds)మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, మినరల్స్, వృక్ష సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. నువ్వులను (Sesame Seeds)ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. నువ్వులను గుప్పెడు మోతాదులో తీసుకుని పెనంపై కాస్త వేయించి రోజూ తినాలి. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నువ్వులను తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలను సైతం నయం చేసుకోవచ్చు.
Read Also : Cancer: గుండె లోపాలతో పుట్టిన శిశువులకు క్యాన్సర్ ముప్పు ఎక్కువ?

రక్తం వృద్ధి చెందుతుంది
నువ్వుల్లో ఫైటో స్టెరాల్స్, లిగ్నన్స్ అనే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనివల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. నువ్వుల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త నాళాలను ప్రశాంతంగా మారుస్తుంది. రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తుంది. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. నువ్వుల్లో ఐరన్, కాపర్ అధికంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
వాపుల నుంచి ఉపశమనం
నువ్వుల్లో అనేక రకాల మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్‌ను అధికంగా పొందవచ్చు. ఇవి ఎముకల నిర్మాణానికి సహాయం చేస్తాయి. ఎముకల సాంద్రతను పెంచుతాయి. దీని వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. విరిగిన ఎముకలు ఉన్నవారు నువ్వులను రోజూ తింటుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. నువ్వుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు సైతం అధికంగా ఉంటాయి. అలాగే వీటిల్లో సెసమోల్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకంగా పనిచేస్తుంది. అందువల్ల కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.

క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి
నువ్వులను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా లభించి షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు వీటిని రోజూ తింటుంటే ఫలితం ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా నువ్వులను రోజూ తింటుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. అలాగే అధిక బరువును తగ్గించుకోవచ్చు. నువ్వులను తినడం వల్ల సెసమిన్, సెసమోల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. నువ్వుల్లో అనేక రకాల బి విటమిన్లతోపాటు జింక్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. కనుక వీటిని రోజూ తింటుంటే శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా నువ్వులను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.
నువ్వుల చరిత్ర?
నువ్వులు ఆఫ్రికన్ ఖండం మరియు సింధు లోయలోని గడ్డి భూములకు చెందినవి . వర్షాధార పంటగా పెరిగిన నువ్వుల నూనె ప్రజలు ఉపయోగించే పురాతన నూనె గింజల మొక్క అని పండితులు వాదిస్తున్నారు. హాన్ రాజవంశం (క్రీ.పూ. 300) సమయంలో చైనాకు పరిచయం చేయబడిన ఇది ఆసియా వంటకాల్లో తరచుగా ఉపయోగించే మొక్కల ఆధారిత నూనెలలో ఒకటి.
నువ్వుల గింజలను దేనికి ఉపయోగిస్తారు?
నువ్వులను ఆహారంలో సలాడ్‌లు, బ్రెడ్ మరియు స్టైర్-ఫ్రైస్ వంటి వంటలలో అలంకరించు లేదా పదార్ధంగా ఉపయోగిస్తారు మరియు నువ్వుల నూనె లేదా తహిని పేస్ట్‌గా ప్రాసెస్ చేస్తారు. వాటి పోషక లక్షణాల కోసం, ముఖ్యంగా చర్మంపై యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు మాయిశ్చరైజింగ్ ప్రభావాలకు ప్రసిద్ధి చెందిన నూనె కోసం వీటిని సాంప్రదాయ వైద్యం మరియు సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: