हिन्दी | Epaper
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

Latest Telugu News : Proteins : ప్రోటీన్లు ఉన్నఆహారాన్నే ఎందుకు తినాలి?

Sudha
Latest Telugu News : Proteins : ప్రోటీన్లు ఉన్నఆహారాన్నే ఎందుకు తినాలి?

మ‌న శ‌రీరానికి స్థూల పోష‌కాలు, సూక్ష్మ పోష‌కాలు అని రెండు ర‌కాల పోష‌కాలు అవ‌స‌రం అవుతాయి. ప్రోటీన్లు, పిండి ప‌దార్థాలు, కొవ్వుల‌ను స్థూల పోష‌కాలు అంటారు. ఎందుకంటే ఇవి మ‌న‌కు రోజూ ఎక్కువ మొత్తంలో అవ‌స‌రం అవుతాయి. అలాగే విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇత‌ర స‌మ్మేళ‌నాల‌ను సూక్ష్మ పోష‌కాలు అంటారు. ఇవి మ‌న‌కు రోజూ త‌క్కువ మొత్తంలో అవ‌స‌రం అవుతాయి. అయితే స్థూల పోష‌కాల్లో చాలా మంది రోజూ పిండి ప‌దార్థాలు, కొవ్వుల‌ను తింటుంటారు. కానీ ప్రోటీన్ల (Proteins)ను స‌రిగ్గా తీసుకోరు. ఇవి మ‌న శ‌రీరానికి శ‌క్తిని అందిస్తాయి. క‌నుక ప్రోటీన్ల (Proteins)ను రోజూ శ‌రీరానికి త‌గినంత మోతాదులో ల‌భించేలా చూసుకోవాలి. ఇక శ‌రీర బరువును బ‌ట్టి మ‌నం రోజూ ప్రోటీన్ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ల వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి.

Read Also: http://Healthy Foods: థైరాయిడ్ సమస్య తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

Proteins
Proteins

పోష‌కాల ఉత్ప‌త్తికి ప్రోటీన్లు అవ‌సరం

మ‌న శ‌రీరంలో క‌ణాలు, క‌ణ‌జాలాల నిర్వ‌హ‌ణ‌, మ‌ర‌మ్మ‌త్తుల‌కు ప్రోటీన్లు అవ‌స‌రం అవుతాయి. కండ‌రాలు, ఎముక‌లు, చ‌ర్మం, శిరోజాల‌కు చెందిన క‌ణాలు, క‌ణ‌జాలాల‌కు ప్రోటీన్లు కావ‌ల్సి ఉంటుంది. ప్రోటీన్ల వ‌ల్ల ఉన్న క‌ణాల‌కు మ‌ర‌మ్మ‌త్తు జ‌రుగుతుంది. క‌ణ‌జాలం వృద్ధి చెందుతుంది. కొత్త క‌ణాలు నిర్మాణం అవుతాయి. ముఖ్యంగా కొల్లాజెన్‌, ఎలాస్టిన్‌, కెరాటిన్ వంటి పోష‌కాల ఉత్ప‌త్తికి ప్రోటీన్లు అవ‌సరం అవుతాయి. వీటి వ‌ల్ల చ‌ర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మ‌న శ‌రీరంలో ప‌లు ఎంజైమ్‌ల ఉత్ప‌త్తికి, జీవ రసాయ‌న చ‌ర్య‌ల‌కు కూడా ప్రోటీన్లు కావాలి. ప్రోటీన్ల వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌కుండా చూసుకోవ‌చ్చు. హార్మోన్ల ఉత్ప‌త్తికి సైతం ప్రోటీన్లు కావ‌ల్సి ఉంటుంది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌కు, శ‌రీరంలో ద్ర‌వాలు నియంత్ర‌ణ‌లో ఉండేందుకు ప్రోటీన్లు స‌హాయం చేస్తాయి. క‌నుక ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను మ‌నం కచ్చితంగా రోజూ తినాల్సి ఉంటుంది.

రోజూ కావల్సిన ప్రోటీన్లు

ప్రోటీన్ల మ‌న‌కు రెండు ర‌కాలుగా ల‌భిస్తాయి. వృక్ష సంబంధ లేదా జంతు సంబంధ ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ప్రోటీన్ల‌ను పొంద‌వచ్చు. శాకాహారం తినేవారు వృక్ష సంబంధ ప‌దార్థాల‌ను తింటున్నా స‌రే ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇక ప్రోటీన్లు మ‌న‌కు ఎక్కువ‌గా మ‌ట‌న్‌, చికెన్‌, చేప‌లు, రొయ్య‌లు, పాలు, పెరుగు, చీజ్‌, ప‌నీర్‌, కోడిగుడ్లు, ప‌ప్పు దినుసులు, శ‌న‌గ‌లు, రాజ్మా, బొబ్బ‌ర్లు, ప‌చ్చి బఠానీలు, సోయా టోఫు, సోయా పాలు, బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్, పిస్తా, చియా విత్త‌నాలు, అవిసె గింజ‌లు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, పీన‌ట్ బ‌ట‌ర్‌, కినోవా, ఓట్స్ వంటి ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ప్రోటీన్ల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ఖ‌ర్జూరాలు, బాదంప‌ప్పు, అవిసె గింజ‌ల పొడి, చియా విత్త‌నాల పొడి, కొకొవా పొడి, కిస్మిస్‌లు, అల్లం ర‌సం, యాల‌కుల పొడి, బాదంనూనె, దాల్చిన చెక్క పొడి, కొబ్బ‌రి తురుము త‌దిత‌ర ప‌దార్థాల‌ను క‌లిపి ప్రోటీన్ ల‌డ్డూల‌ను త‌యారు చేసి రోజూ ఒక‌టి తిన‌వ‌చ్చు. ఇలా కూడా శ‌రీరానికి రోజూ కావల్సిన ప్రోటీన్ల‌ను పొంద‌వ‌చ్చు.

Proteins
Proteins

ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి

ఇక ప్రోటీన్ల‌ను ఎవ‌రైనా స‌రే త‌మ శ‌రీర బ‌రువును బ‌ట్టి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. నిపుణులు చెబుతున్న ప్ర‌కారం ప్ర‌తి 1 కిలో శ‌రీర బ‌రువుకు మ‌న శ‌రీరానికి 0.8 గ్రాముల ప్రోటీన్ల‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 50 కేజీల బ‌రువు ఉన్న వ్య‌క్తి రోజుకు సుమారుగా 50*0.8=40 గ్రాముల ప్రోటీన్ల‌ను తీసుకోవాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. ఇలా ఎవ‌రికి వారు తమ శ‌రీర బ‌రువుకు అనుగుణంగా త‌మ‌కు రోజుకు ఎన్ని గ్రాముల ప్రోటీన్లు కావాలో లెక్కించి ఆమేర ప్రోటీన్ల‌ను తినాల్సి ఉంటుంది. ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి మూడు స‌మ‌యాల్లోనూ తీసుకునే ఆహారాల్లో ప్రోటీన్లు మొత్తం క‌లిపి రోజువారి కోటాను భ‌ర్తీ చేయాలి. ఇలా చేస్తుంటే మన శ‌రీరానికి ప్రోటీన్లు స‌రిగ్గా ల‌భిస్తాయి. వీటి వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి.

ప్రోటీన్ అంటే ఏమిటి?

ప్రోటీన్ అనేది అమైనో ఆమ్లాలతో తయారైన సంక్లిష్ట అణువు, ఇది శరీరంలో కణజాలాలు మరియు కండరాలను నిర్మించడం నుండి జీవక్రియ ప్రతిచర్యలను ఉత్ప్రేరకపరచడం మరియు అణువులను రవాణా చేయడం వరకు విస్తృత శ్రేణి విధులను నిర్వహిస్తుంది. ఈ అమైనో ఆమ్లాలు ప్రోటీన్లను ఏర్పరచడానికి పొడవైన గొలుసులలో కలిసి ఉంటాయి మరియు అమైనో ఆమ్లాల నిర్దిష్ట క్రమం ప్రోటీన్ యొక్క నిర్మాణం మరియు పనితీరును నిర్ణయిస్తుంది. శరీరానికి 22 అమైనో ఆమ్లాలు అవసరం, వీటిలో తొమ్మిది “అవసరమైనవి” మరియు ఆహారం ద్వారా పొందాలి.

మానవులలో ఎన్ని ప్రోటీన్లు ఉన్నాయి?

మానవ శరీరంలో 100,000 కంటే ఎక్కువ రకాల ప్రోటీన్లు ఉన్నాయి, ఇవి సుమారు 20,000 జన్యువుల నుండి సృష్టించబడ్డాయి. జన్యు స్ప్లిసింగ్ మరియు పోస్ట్-ట్రాన్స్లేషనల్ సవరణలు వంటి ప్రక్రియల ద్వారా ఒకే జన్యువు బహుళ ప్రోటీన్లను ఉత్పత్తి చేయగలదు కాబట్టి ఈ పెద్ద సంఖ్య సాధ్యమవుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870