ఒకే ఇంట్లోని వారంతా ఒకే సబ్బు వాడటం అనేది చాలామంది ఇప్పటికీ ఫాలో అవుతున్న అలవాటు. ముఖ్యంగా పాత రోజుల్లో ఒకే బాత్‌రూమ్ ఉండటం, సబ్బులు పరిమితంగా అందుబాటులో ఉండటం వంటివి ఈ అలవాటు ఏర్పడడానికి కారణాలు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారినా కూడా ఈ పద్ధతి చాలా ఇళ్లలో కొనసాగుతుంది. వైద్య నిపుణులు మాత్రం ఈ అలవాటు ఆరోగ్యానికి అనేక సమస్యలను తీసుకొస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఒకే సబ్బు వాడటం వల్ల వచ్చే సమస్యలు
స్నానానికి ఇదివరకటి రోజుల్లో అయితే సున్నిపిండి వంటివి వాడేవారు. కానీ, రోజులు మారాయి. సబ్బులొచ్చాయి. దీంతో సబ్బు తెచ్చి వాడడం మొదలుపెట్టారు. ఒక్క సబ్బు తీసుకొస్తే ఇంట్లోని వారంతా దాంతోనే స్నానం చేయడం ముఖం కడగడం వంటివి చేసేవారు. అయితే, ఈ అలవాటు వల్ల చర్మవ్యాధులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ (Bacterial infections) వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్.
మరొకరికి సెట్
అవేంటంటే,అందరూ ఒకే ఇంట్లో వారైనా ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుంది. దీంతో ఒకరి అవసరాలకి తగిన సబ్బు మరొకరికి సెట్ కాకపోవచ్చు. ఒకరిది డ్రై స్కిన్ అయి కాస్తా మాయిశ్చర్ సబ్బు వాడితే మరొకరిది ఆయిలీ స్కిన్ అయి మైల్డ్ సోప్ (Mild soap) వాడతారు. ఇలాంటి సందర్భంలో అందరికీ ఒకే సబ్బు పడదు. అలా కాదని వాడితే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఇంట్లోని వారికి ఏదైనా ఇన్ఫెక్షన్
ముందుగా చెప్పుకున్నట్లుగా అందరి శరీరతత్వం ఒకేలా ఉండదు. ముక్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉండే చిన్నారులు, వృద్దులకి కూడా సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఇలా ఎప్పుడు చేయొద్దు.ఇంట్లోని వారికి ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా దెబ్బ తగిలి గాయమైనప్పుడు సబ్బు రాయడం అదే సబ్బుని అందరూ వాడడం వల్ల ఇతరులకి కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది.
బ్యాక్టీరియా పెరిగి

ఎగ్జిమా వంటి చర్మ సంబంధిత సమస్యలు ఈజీగా ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి. సబ్బుని వాడాక క్లీన్ చేయరు చాలా మంది. దీంతో అందులోని బ్యాక్టీరియా పెరిగి ఇతరులకి సమస్యలొచ్చే అవకాశం పెరుగుతుంది. సబ్బుని క్లీన్ చేసి ఆరాక వాడితే అంతగా సమస్య ఉండదు.
కొన్ని జాగ్రత్తలు
సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవిప్రతీ ఒక్కరూ విడివిగా వారికంటూ ప్రత్యేకమైన సోప్ వాడాలి. సున్నిపిండివంటివి వాడడం మంచిది. లిక్విడ్ సోప్ వాడినా పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. తప్పనిసరి పరిస్థితిలో మరొకరు వాడిన సబ్బు వాడాల్సి వస్తే సబ్బు కడిగి పూర్తిగా ఆరాకే వాడడం మంచిది. ఇతరులు వాడిన సబ్బుని ప్రైవేట్ పార్ట్స్‌లో రాయడం మంచిది కాదు.
గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి బాధ్యత వహించదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Mosquito infestation: దోమల బెడదను ఎలా నివారించాలో తెలుసా..