हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Bad Breath : నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Sudha
Latest Telugu news : Bad Breath : నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

నోటి దుర్వాస‌న స‌మ‌స్య అనేది స‌హ‌జంగానే చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. నోటి దుర్వాసన స‌మ‌స్య ఉంటే న‌లుగురిలో మాట్లాడేందుకు వెనుకాడుతుంటారు. దీర్ఘ‌కాలికంగా జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నా, ప‌లు ర‌కాల మెడిసిన్ల‌ను వాడుతున్నా, నోట్లో ఆహార ప‌దార్థాలు ఇరుక్కుపోయినా, జ్వ‌రం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా నోరు దుర్వాస‌న‌ (Bad Breath )గా ఉంటుంది. అయితే నోటి దుర్వాస‌న‌ (Bad Breath )ను త‌గ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే ప‌లు ప‌దార్థాల‌తోనే స‌హ‌జ‌సిద్ధంగా ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో నోట్లోని బ్యాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న నుంచి విముక్తి ల‌భిస్తుంది. అలాగే దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

Bad Breath : నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!
Bad Breath : నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

నాలుక‌ను సైతం శుభ్రం చేసుకోవాలి

నోరు దుర్వాస‌న (Bad Breath )ఉన్న‌వారు ఎల్ల‌ప్పుడూ నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దంతాల మ‌ధ్య ఎలాంటి ఆహారాలు చిక్కుకుపోకుండా చూసుకోవాలి. రోజుకు 2 సార్లు బ్ర‌ష్ చేయాలి. దంతాల మ‌ధ్య ఉన్న ఆహారాల‌ను తొల‌గించాలి. అలాగే నాలుక‌ను సైతం శుభ్రం చేసుకోవాలి. నీళ్ల‌ను త‌గిన మోతాదులో తాగాలి. చ‌క్కెర ఉండే ప‌దార్థాలు లేదా పానీయాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి. లేదా పూర్తిగా మానేస్తే మంచిది. ఉప్పు నీటితో త‌ర‌చూ నోటిని పుక్కిలిస్తుండాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగ‌ర్‌ను వేసి బాగా కలిపి ఆ మిశ్ర‌మాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తున్నా కూడా నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన చెక్క వంటి మ‌సాలా దినుసుల‌ను నోట్లో వేసుకుని న‌మిలి తింటుండాలి. దీని వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. భోజ‌నం చేసిన అనంతరం సోంపు గింజ‌ల‌ను తింటున్నా కూడా ఫ‌లితం ఉంటుంది.

ఆయిల్ పుల్లింగ్

పుదీనా ఆకుల‌ను నోట్లో వేసుకుని న‌మిలి తింటున్నా కూడా నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. ఈ ఆకుల్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది స‌హ‌జ‌సిద్ధ‌మైన డియోడ‌రైజ‌ర్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల నోటి దుర్వాస‌న త‌గ్గిపోతుంది. అల్లంతో త‌యారు చేసిన హెర్బ‌ల్ టీని సేవిస్తుంటే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అల్లంలో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు నోరు, దంతాలు, చిగుళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. పెప్ప‌ర్ మింట్ టీని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు నోట్లోని బ్యాక్టీరియాను తొల‌గిస్తాయి. దీంతో స‌మ‌స్య త‌గ్గుతుంది. రోజూ 15 నిమిషాల పాటు ఉద‌యం ప‌ర‌గ‌డుపునే ఆయిల్ పుల్లింగ్ చేసేవారికి నోటి దుర్వాస‌న ఉండ‌దు. ఇందుకు గాను ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌రినూనె లేదా నువ్వుల నూనెను తీసుకుని నోట్లో పోసి 15 నిమిషాల పాటు నోరు అంతా ఆ నూనెను తిప్పుతూ బాగా పుక్కిలించాలి. అనంత‌రం క‌డిగేయాలి. దీని వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శించి నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.

Bad Breath : నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!
Bad Breath : నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

వ్యాధులు ఉన్నా..

యాపిల్ పండ్ల‌ను లేదా క్యారెట్ల‌ను రోజూ తినేవారికి దంతాలు, నోరు, చిగుళ్ల స‌మ‌స్య‌లు ఉండ‌వు. నోటి దుర్వాస‌న ఉన్న‌వారు ప‌లు ఆహారాల‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఉల్లిపాయ‌లు, వెల్లుల్లి వంటి ఆహారాల‌ను తిన‌కూడ‌దు. నోటి దుర్వాస‌న ఉందంటే కొన్ని సార్లు అది వేరే ఏదైనా వ్యాధికి సూచ‌న‌గా కూడా భావించాలి. సాధార‌ణంగా ప‌లు ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్నా కూడా నోటి దుర్వాస‌న అంత సుల‌భంగా త‌గ్గ‌దు. చిగుళ్ల వ్యాధులు, తీవ్ర‌మైన గ్యాస్ ట్ర‌బుల్‌, టాన్సిల్స్‌, సైన‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, కిడ్నీలు, లివ‌ర్ వ్యాధులు ఉన్నా కూడా నోటి దుర్వాస‌న వ‌స్తుంటుంది. క‌నుక ఏ చిట్కాల‌ను పాటించినా స‌మ‌స్య త‌గ్గ‌డం లేదు అంటే ఏదైనా వ్యాధి ఉందేమోన‌ని భావించాలి. అప్పుడు వైద్యులను క‌లిసి అవ‌సరం అయిన మేర‌కు ప‌రీక్ష‌లు చేయించుకుని, అనంత‌రం చికిత్స తీసుకోవాలి. దీంతో వ్యాధి త‌గ్గ‌డ‌మే కాక నోటి దుర్వాస‌న కూడా దానంత‌ట అదే తొల‌గిపోతుంది.

దుర్వాసన అంటే ఏమిటి?

దుర్వాసన రావడానికి 7 కారణాలు దుర్వాసన లేదా హాలిటోసిస్ అనేది నోటి నుండి వచ్చే అసహ్యకరమైన వాసన, ఇది తరచుగా నోటి పరిశుభ్రత లేకపోవడం, నిర్దిష్ట ఆహారాలు లేదా చిగుళ్ల వ్యాధి కారణంగా వస్తుంది. సాధారణమైన మరియు తరచుగా తాత్కాలికమైనప్పటికీ, నిరంతర దుర్వాసన లోతైన నోటి లేదా దైహిక ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది మరియు వైద్య సహాయం అవసరం కావచ్చు. మూల కారణాలు సాధారణంగా నోటిలో సల్ఫర్ సమ్మేళనాలను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా, కానీ మూత్రపిండాల వైఫల్యం, మధుమేహం లేదా ఇన్ఫెక్షన్లు వంటి వైద్య పరిస్థితులు కూడా ప్రత్యేకమైన, దుర్వాసనలను ఉత్పత్తి చేస్తాయి.

దుర్వాసనను ఎలా నియంత్రించాలి?

దుర్వాసనను నియంత్రించడానికి, రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ప్రతిరోజూ ఫ్లాసింగ్ చేయడం మరియు బ్యాక్టీరియాను తొలగించడానికి మీ నాలుకను శుభ్రం చేయడం ద్వారా అద్భుతమైన నోటి పరిశుభ్రతను పాటించండి. హైడ్రేటెడ్ గా ఉండటం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు వంటి కొన్ని ఆహారాలను పరిమితం చేయడం మరియు చక్కెర లేని గమ్ నమలడం కూడా సహాయపడుతుంది. దుర్వాసన కొనసాగితే, ఇతర ఆరోగ్య సమస్యలను తోసిపుచ్చడానికి మరియు వృత్తిపరమైన శుభ్రపరచడం కోసం దంతవైద్యుడిని సంప్రదించండి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870