కలబంద అనేది ఆయుర్వేద మొక్క. దీనిని ఇంట్లో చాలా తక్కువ స్థలంలో పెంచుకోవచ్చు. కలబంద అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అందం కోసం ఎక్కువగా వాడుతారని. కానీ, కలబంద (Aloe vera)చర్మానికి మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా అద్భుతమైన మేలు చేస్తుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. విటమిన్లు A, C, E, ఫోలిక్ యాసిడ్, కోలిన్ వంటి పోషకాలతో పాటు, ఇది శరీరాన్ని అనేక సమస్యల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే, కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా అలోవెరాను ఉపయోగించరాదని నిపుణులు చెబుతున్నారు. గర్భీణీలు కలబందను(Aloe vera) నోటికి తగలకుండా చూసుకోవాలి. కడుపులోకి తీసుకోరాదు. ఇది గర్భాశయ సంకోచానికి కారణమవుతుంది. ఇది గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, అలోవెరా జ్యూస్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.
Read Also : Health: ముఖ సౌందర్యానికి ఈ సుగంధ ద్రవ్యాలను రాస్తున్నారా..?

కలబంద రసం అధికంగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కలబంద రసం అధికంగా తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది బలహీనత, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కలబంద అధిక మొత్తంలో ఉపయోగించడం వల్ల అలెర్జీ ప్రమాదాన్ని పెంచుతుంది. కలబంద కొమ్మ నుండి నేరుగా జెల్‌ను తీసి అప్లై చేస్తే, అది అలెర్జీలకు కారణం కావచ్చు. దీనివల్ల చర్మంపై అలర్జీ, కళ్లు ఎర్రబడడం, దద్దుర్లు, మంట, దురద వంటి సమస్యలు వస్తాయి.కలబంద రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కలబందలో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇది కాలేయం నిర్విషీకరణ ప్రక్రియను అడ్డుకుంటుంది. కలబందను అధికంగా తీసుకోవడం వల్ల గుండె కొట్టుకోవడం మందగిస్తుంది. దీని వల్ల శరీరంలో అలసట, బలహీనత వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలోవెరా జెల్ ఉపయోగించే ముందు, డాక్టర్ సలహా తీసుకోవాలి.కలబంద రసం సహజ భేదిమందు లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది శరీరం నుండి అదనపు నీటిని తొలగించి నిర్జలీకరణానికి దారితీస్తుంది. ముఖంపై మెరుపు కోసం తరచుగా కలబందను ఉపయోగిస్తారు. దీని వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, మీరు అధిక పరిమాణంలో కలబందను ఉపయోగిస్తే, అది హానికరంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: