chandrababa and vijayasai reddy

విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు స్పందన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని శుక్రవారం ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. శనివారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసిన విజయసాయిరెడ్డి రాజీనామా పత్రం సమర్పించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదన్న విజయసాయిరెడ్డి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని.. ఎలాంటి ఒత్తిడి లేదని చెప్తున్నారు. వేరే పదవులు, ప్రయోజనాలు కూడా ఆశించడం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే వైసీపీలో అత్యంత కీలక స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఒక్కసారిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, రాజీనామా చేయడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

Advertisements

ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. దావోస్ పర్యటన విశేషాల గురించి చంద్రబాబు నాయుడు.. శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై చంద్రబాబును విలేకర్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేసిన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదని విమర్శించారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఇదే పరిస్థితి వస్తుందంటూ నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Related Posts
నేడు పల్నాడుకు సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu's visit to tirupathi from today

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పార్టీ Read more

విజయసాయిరెడ్డిని విమర్శించిన వైఎస్ షర్మిల
విజయసాయిరెడ్డిని విమర్శించిన వైఎస్ షర్మిల

వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా చర్చకు దారితీసింది. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన Read more

Kavitha : పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు: కవిత
Pawan became Deputy CM unexpectedly.. Kavitha

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడని… సెటైర్లు Read more

Andhrapradesh: కారు తీయకుండానే సిమెంట్ రోడ్డు వేసి ఆపై వింత వాదన
Andhrapradesh: కారు తీయకుండానే సిమెంట్ రోడ్డు వేసి ఆపై వింత వాదన

ఏపీలోని బాపట్ల జిల్లా దేశాయిపేటలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అక్కడ, సిమెంట్ రోడ్డు వేయడానికి ముందు, సాధారణంగా అడ్డంకులన్నింటినీ తొలగించి, కాంక్రీట్ వేసేందుకు ఏర్పాట్లు Read more

×