Pawan became Deputy CM unexpectedly.. Kavitha

Kavitha : పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు: కవిత

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడని… సెటైర్లు పేల్చారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని ఆమె వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించడమేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

Advertisements
పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం

ఆయన చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా

దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారని చురకలాంటించారు. చేగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి అప్పుడు రైటిస్ట్ ఎలా అయ్యారు అంటూ ఆగ్రహించారు. ఆయన చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధం గా ఉంటాయని మండి పడ్డారు. రేపు తమిళనాడు వెళ్లి హిందీ చేయబోమనైన ఆయన చెప్పవచ్చు అంటూ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.

కవిత కామెంట్స్ పై జనసేన నేతలు విమర్శలు

పార్టీ పెట్టిన 15 ఏళ్లకు పవన్ ఎమ్మెల్యే అయ్యారని.. వైసీపీ మినహా దాదాపు ఏపీలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని కవిత అన్నారు. అయితే కవిత కామెంట్స్ పై జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఊతికారేస్తున్నారు. కవితకు ఏ అర్హత ఉందని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టైన విషయాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి స్కామ్ లు చేస్తేనే సీరియస్ పొలిటీషియన్ అన్నట్లా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

Related Posts
మద్యం అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు
ap liquor sit

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అక్రమాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు రాష్ట్రంలో జరిగిన మద్యం విక్రయాలపై దర్యాప్తు కోసం ప్రత్యేక Read more

Nagavali Express : పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్
Nagavali Express derailed

Nagavali Express : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి బొబ్బిలి వైపు వస్తున్న 'నాగావళి ఎక్స్ ప్రెస్' పట్టాలు Read more

Vallabhaneni Vamshi : వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు
vamshi 2nd day

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకు ఆయనను రిమాండ్‌లో కొనసాగించాలని Read more

విమానం ల్యాండింగ్ గేర్ లో రెండు మృతదేహాలు
flightlanding

ఫ్లోరిడాలోని విమానాశ్రయంలో వెలుగు చూసిన దారుణం విమాన ల్యాండింగ్ గేర్ వద్ద తనిఖీల్లో వెలుగు చూసిన మృతదేహాలు ధ్రువీకరించిన జెట్‌బ్లూ విమాన సంస్థ అమెరికాలో ఓ దారుణ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×