chandrababa and vijayasai reddy

విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు స్పందన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని శుక్రవారం ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. శనివారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసిన విజయసాయిరెడ్డి రాజీనామా పత్రం సమర్పించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదన్న విజయసాయిరెడ్డి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని.. ఎలాంటి ఒత్తిడి లేదని చెప్తున్నారు. వేరే పదవులు, ప్రయోజనాలు కూడా ఆశించడం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే వైసీపీలో అత్యంత కీలక స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఒక్కసారిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, రాజీనామా చేయడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. దావోస్ పర్యటన విశేషాల గురించి చంద్రబాబు నాయుడు.. శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై చంద్రబాబును విలేకర్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేసిన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదని విమర్శించారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఇదే పరిస్థితి వస్తుందంటూ నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Related Posts
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుపై నాగబాబు కీలక వ్యాఖ్యలు
nagababu speech janasena

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుండి గెలుపుపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన ప్రకారం, పవన్ కల్యాణ్ విజయం ఏవైనా ఇతర కారణాల Read more

ఉద్యోగుల ఆరోగ్య బీమాపై ప్రభుత్వం గుడ్ న్యూస్
Employee health insurance

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఆరోగ్య బీమా పథకం అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని DME గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చింది. Read more

ఏపీలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యుటీ పెంపు
ap anganwadi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గొప్ప గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలో పని చేస్తున్న వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యుటీ పెంచాలని నిర్ణయం తీసుకుంది. Read more

జగన్-షర్మిల ఆస్తి వివాదంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఘాటు వ్యాఖ్యలు
rachamallu

జగన్ - షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల వివాదంపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. జగన్ ఆస్తుల కోసం షర్మిల Read more