cbn jagan

జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఈరోజు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. రాజకీయ వేదికగా జగన్ , చంద్రబాబు రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేసుకుంటారు. అయినప్పటికీ రాజకీయ వైరాలను పక్కన పెట్టి ఇవాళ (డిసెంబర్ 21) పుట్టిన రోజు జరుపుకుంటున్న జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు పొందాలని మరియు ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ తన సందేశాన్ని గవర్నర్ తెలియజేశారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అన్ని వర్గాల నుంచి జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి తమ నాయకుడి పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తున్నారు. వైసీపీ కార్యాలయాలు, ప్రచార వేదికల వద్ద జగన్ ఫొటోలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా కూడా జగన్ పుట్టినరోజు ట్వీట్స్ వేస్తున్నారు.

Related Posts
జెప్టో $300 మిలియన్ నిధులను సేకరించేందుకు ప్రణాళిక
zepto

ఇండియాలో ప్రముఖ క్విక్ కామర్స్ స్టార్టప్ అయిన జెప్టో(Zepto) తన వ్యాపారాన్ని పెంచేందుకు $300 మిలియన్ నిధులను సేకరించాలనుకుంటోంది. ఈ నిధులు సేకరణ ద్వారా, జెప్టో భారతీయ Read more

లంచం, మోసం ఆరోపణలు..గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు..!
చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

న్యూయార్క్‌: భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్‌లో కేసు నమోదైంది. మల్టీబిలియన్ డాలర్ల లంచం, మోసానికి Read more

పుష్ప 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన మేకర్స్..ఇక తగ్గేదేలే
pushpa 2 dec 5

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న "పుష్ప-2" చిత్రం అధికారిక విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని అర్ధం చేసుకున్నారు. Read more

వ్యవసాయ రంగానికి బడ్జెట్లు రూ.48,340
acham

ఏపీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. Read more