Chandrababu's visit to tirupathi from today

నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన..!

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట మండలం యల్లమందలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. శారమ్మ అనే మహిళకు వితంతు పెన్షన్, ఏడుకొండలు అనే వృద్దుడికి వృద్ధాప్య పెన్షన్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు గొట్టిపాటి, అనగాని,రామనారాయణరెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యల్లమంద గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి ఉంటుంది. కోటప్పకొండ త్రికోటేస్వరుణ్ణి చంద్రబాబు దర్శించుకోనున్నారు. పలువురు మంత్రులు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో యల్లమంద చుట్టుపక్కల మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

మరోవైపు..ఏపీలో ఈరోజు ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈ మేరకు 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాని ప్రభుత్వం చేపట్టింది.

Related Posts
SSMB29 స్టోరీ హింట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్
vijendraprasad

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ చిత్రం గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాపై Read more

తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి కొవ్వు లేదు – India Today సంచలన అధ్యయనం
tirumala laddu

తిరుమల లడ్డూ ప్రసాదం విషయమై India Today తన అధ్యయన ఫలితాలను బహిర్గతం చేసింది. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాలపై పరిశీలన జరిపిన అనంతరం, తిరుమల లడ్డూ Read more

తెలంగాణ లోని జిల్లాలకు BJP అధ్యక్షులు వీరే
telangana bjp

తెలంగాణ రాష్ట్రంలో భాజపా (BJP) తన శక్తిని మరింత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 27 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం అధికారిక ప్రకటన Read more

ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత
BJP stalwart LK Advani's he

బీజేపీ సీనియర్ నేత మరియు భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 97 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన, ఢిల్లీలోని అపోలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *