Chandrababu should be responsible for the stampede.. Bhumana Karunakar Reddy

తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలి : భూమన

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. పశువుల మంద మాదిరిగా భక్తులను తోసేశారు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరు. టీటీడీ వ్యవస్త పూర్తిగా వైఫల్యం చెందడంతోనే తొక్కిసలాట జరిగింది. భక్తులకు నీళ్లు, ఆహారం లేవు.. పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఇవాళ చంద్రబాబు పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ తొక్కిసలాట జరిగిన సమయంలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

Advertisements
image
image

సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తారన్న పవన్ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దేవుడిని రాజకీయాల కోసం పావులా వాడుకుంటున్నారని తెలిపారు. చనిపోయిన వారికి రూ.20లక్షలు ఎక్స్ గ్రేషియా, గాయపడిన 10లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. లడ్డూ విషయంలో వైసీపీ, జగన్ పై అసత్య ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు.. చేసే చేతలకు పొంతన లేదన్నారు.ఈవో, జేఈవోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధువారం జరిగిన తొక్కిసలాట ఘటనా అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చిన కారణంగా గందరగోళం చోటుచేసుకొని తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

Related Posts
ట్రంప్ విధానాలతో లక్ష ఉద్యోగాలకు ఎసరు!
మూడోసారి కూడా నేనే అధ్యక్షుడుగా వుంటాను: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాల కారణంగా ప్రపంచ వాణిజ్య యుద్ధం పెరిగే ప్రమాదం నెలకొంది. అమెరికాలోకి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై ట్రంప్ 25% Read more

చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు – అంబటి
ambati chiru

మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిందని చిరంజీవి చేసిన ప్రకటనపై అంబటి Read more

ఉప ఎన్నిక‌లపై కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు
Key comments of KCR on by elections

తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతారు హైదరాబాద్‌: మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉప ఎన్నిక‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీ Read more

భారతదేశంలో అత్యంత యువ పైలెట్‌గా సమైరా హుల్లూర్..
samaira hullur

18 ఏళ్ల సమైరా హుల్లూర్, కర్ణాటక రాష్ట్రం నుండి భారతదేశంలో అత్యంత యువ వాణిజ్య పైలెట్‌గా గుర్తింపు పొందింది. ఆమె 18 ఏళ్ల వయస్సులోనే కమర్షియల్ పైలట్ Read more

×