ఏపీకి కేంద్రమంత్రి సహకరిస్తున్నారన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికలో పోస్ట్ చేశారు.ఢిల్లీ పర్యటనలో భాగంగా,చంద్రబాబు ఖట్టర్ తో సమావేశమయ్యారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.విశాఖ మరియు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు పై చర్చలు విజయవంతంగా జరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైనవి.

ముఖ్యంగా రాష్ట్ర సామాజిక, ఆర్థిక, అభివృద్ధి ప్రాజెక్టులపై ఖట్టర్ తో విస్తృతంగా చర్చించారు.ఈ చర్చలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి దోహదపడతాయని చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రం యొక్క అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేయనున్నాయి. విశాఖ పర్యటనను పూర్తి చేసిన అనంతరం, చంద్రబాబు నేరుగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. చంద్రబాబునాయుడు ఈ రోజు రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు.