Chandrababu pays tribute to Manmohan Singh mortal remains

మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి చంద్రబాబు నివాళి

lన్యూఢిల్లీ: ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు.

కాగా, మాజీ ప్రధాని,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధాకరమని షర్మిల అన్నారు. భారత దేశ ఆర్థికశిల్పి మరణం దేశానికి తీరని లోటని వివరించారు. రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా, అంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, మన దేశానికి అందించిన సేవలు అమూల్యమని అన్నారు.

Related Posts
కుంభమేళా తొక్కిసలాటపై జయా బచ్చన్ ఆరోపణలు
కుంభమేళా తొక్కిసలాటపై జయా బచ్చన్ ఆరోపణలు

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ, ప్రముఖ నటి జయా బచ్చన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో Read more

ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు
Harish Kumar Gupta is the new DGP of AP

అమరావతి: ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. నేడు ఫ్యామిలీతో కలిసి తన ఛాంబర్ లోకి ప్రవేశించిన ఆయన, లాంఛనంగా బాధ్యతలు Read more

YS Jagan:దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించనున్న వైఎస్ జగన్
YS Jagan దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించనున్న వైఎస్ జగన్

YS Jagan:దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించనున్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ Read more

లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మొదలైన కార్చిచ్చు..
fire started again in Los Angeles

న్యూయార్క్‌: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఇటీవల చెలరేగిన కార్చిచ్చు మళ్లీ మొదలైంది. తాజాగా మరో ప్రాంతంలో కొత్త మంటలు చెలరేగాయి. దీంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి. Read more