Chandrababu pays tribute to Bharat Ratna Atal Bihari Vajpayee on his centenary

భారతజాతి గర్వించదగిన నేత వాజ్ పేయి : చంద్రబాబు

న్యూఢిల్లీ: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. “భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది. సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నది.

Advertisements

‘నేషన్ ఫస్ట్’ అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండిపోతుంది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచిపోలేను. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి” అని ఎక్స్‌లో చంద్రబాబు పోస్ట్ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నేటి ఉదయం వాజపేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. విజయ్‌ఘాట్‌లోని వాజపేయి మెమోరియల్‌ వద్ద చంద్రబాబు నివాళులు అర్పిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బుధవారం మధ్యాహ్నం జరగనున్న ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో చంద్రబాబు భేటీపై ఇంకా స్పష్టత రాలేదు.

Related Posts
నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ
నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ

నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఫ్రాన్స్‌కు రెండు రోజుల అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో, ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో Read more

ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్
Private Bus Exploitation Du

తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందర్బంగా ప్రజలు సొంతూర్లకు వెళ్లేందుకు ఉత్సాహంగా సిద్ధంగా కాగా.. పండుగ రద్దీ కారణంగా ప్రయాణాలకు సంబంధించిన కష్టాలు అధికమవుతున్నాయి. హైదరాబాద్ Read more

Moderate Rains : ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
rain alert

తెలంగాణలో రాబోయే 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో Read more

రేవంత్ రెడ్డికి ప్రజల కంటే కాంట్రాక్టర్లే ముఖ్యమా? – ఎమ్మెల్సీ కవిత
kavitha cm

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. "6500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం" Read more