ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని (Drug-free) రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కఠినంగా ముందడుగు వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయిని ప్రోత్సహించిన విధానాలకు పునాది పడి యువత బానిసలైపోయిందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో శక్తివంతమైన వ్యూహం ఉందని, డ్రగ్స్ నాశనానికి ఎటువంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు.

“గంజాయి మాట కూడా వినిపించకూడదు”
గుంటూరులో నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ డే వాకథాన్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మాట్లాడుతూ రాష్ట్రంలో విద్వేశాలను రెచ్చగొడుతూ, గంజాయి బ్యాచ్‌కు అండగా నిలిచే వారికి తగిన గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు. గంజాయి నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వ బాధ్యతే మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతన అని ఆయన గుర్తుచేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతిపక్షాలు కూడా కలిసినడవాలని కోరారు.
‘ఈగల్’ – డ్రగ్స్ పై నిఘాకు ప్రత్యేక విభాగం
డ్రగ్స్ మూలాలపై సాంకేతికంగా నిఘా పెట్టేందుకు ‘ఈగల్’ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు చెప్పారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసలై యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎక్కడ డ్రగ్స్ మూలాలు కనిపించిన డేగ కన్ను వేసి ఉంచుతుందని తెలిపారు.
యువత మత్తుపదార్థాల బానిసలవడం దురదృష్టకరం
రాష్ట్రంలో మళ్లీ ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే వారిపై కఠిన చర్యలతో పాటు వారి అస్తులు కూడా జప్తు చేస్తామని సీఎం హెచ్చరించారు. డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎవరైనా, ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి ఆనవాళ్లను గుర్తిస్తే 1972కి సమాచారం ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘ఇప్పటి యువత దేశ నిర్మాణానికి మూలస్తంభాలవ్వాల్సిన సమయంలో, గంజాయి, డ్రగ్స్ వలయాల్లో చిక్కి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం.
2021 గంజాయి రికార్డు – ఆంధ్రప్రదేశ్ మీద మచ్చ
2021లో దేశవ్యాప్తంగా పండిన మొత్తం గంజాయిలో 50 శాతం ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లోనే ఉత్పత్తి కావడం రాష్ట్రంపై మచ్చవేసిందని చంద్రబాబు తెలిపారు. అదే పరిస్థితులు మళ్లీ దొరకకుండా ఈ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు
Read also: Jahnavi Dangeti: అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు అమ్మాయి