ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు జీవనాడిగా నిలిచిన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవుతుందన్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నీటిపారుదల, పర్యావరణ, విద్యుత్ మరియు వ్యవసాయ రంగాల్లో ఊతమిచ్చే విధంగా పోలవరం ప్రాజెక్టు (Polavaram project) రూపుదిద్దుకుంటుందని, ఏడాదిన్నరలో పనులను పూర్తి చేసి, 2027లోగా జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.

పోలవరం పనులకు కేంద్రం మద్దతు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.12,500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోందని వెల్లడించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు
తన ప్రసంగంలో వైసీపీ హయంపై చంద్రబాబు గట్టి విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
పార్టీ నాయకులకు దిశానిర్దేశం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడంలో నేతల భాగస్వామ్యం కీలకం అని చెప్పారు.
సుపరిపాలన లక్ష్యంగా నిర్ణయాలు
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా తొలి అడుగు వేశాం. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఎన్నికల్లో దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశాం. సంక్షేమం అంటే ఏంటో చూపించిన పార్టీ మనది. చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యం. భవిష్యత్తులో ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాలి” అని చంద్రబాబు పేర్కొన్నారు. పింఛన్ల పెంపు, పంటలకు గిట్టుబాటు ధర, అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు మంజూరు, వాట్సప్ గవర్నెన్స్‌తో సుమారు 500 సేవలు ఆన్‌లైన్‌లో అందిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల మంజూరు
పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులకు కూడా కేంద్రం నుంచి నిధులు అందుతున్నాయని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. స్టీల్‌ప్లాంట్‌కి రూ.11,400 కోట్లు మంజూరు చేసిందని చంద్రబాబు చెప్పారు.
Read also: Andhra pradesh: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం