Chandrababu Naidu played a key role in the unanimous resolution on SC classification.. Manda Krishna

Manda krishna: ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలక పాత్ర: మందకృష్ణ

Manda krishna: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలక పాత్ర అన్నారు. 1997-98లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ విజయం 30 ఏళ్ల పోరాటంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు.

ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో

చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేశారు

1996లో మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు తొలిసారి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేశారు. చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకొని 1997లో పాదయాత్ర ప్రారంభించా. మోడీ, అమిత్‌ షా, వెంకయ్య, కిషన్‌ రెడ్డి.. మాకు అండగా నిలిచారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తుచేస్తూ పవన్‌ కల్యాణ్‌ కూడా మద్దతు ఇచ్చారు. మా ఉద్యమంలో న్యాయం ఉందనేందుకు ఏకగ్రీవ తీర్మానాలే నిదర్శనం. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబు న్యాయం వైపే నిలబడ్డారు. ఇచ్చిన మాట కోసం ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చంద్రబాబు చతురత వల్లే తీర్మానం

జగన్‌ అధికారంలో ఉంటే గనక ఎస్సీ వర్గీకరణను ఇక చూసేవాళ్లం కాదు. కనీసం వినతిపత్రం ఇచ్చేందుకూ జగన్‌ మాకు అనుమతి ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాన్ని వైసీపీ ఇంకా చెప్పలేదు. చంద్రబాబు చతురత వల్లే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు సామాజిక న్యాయం చేశారు అని కొనియాడారు.

Related Posts
గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు
Police notices to Gorantla Madhav

అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం అమరావతి: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మహిళా కమిషన్ చైర్మన్ Read more

భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం
bcm

వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి శ్రీ రామచంద్ర స్వామి ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున స్వామివారి ఉత్తర ద్వారం భక్తుల దర్శనార్థం తెరవడం ద్వారా మహోత్సవాలకు Read more

Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై నమోదైన పిటిషన్లు
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై నమోదైన పిటిషన్లు

జాతీయ గీతాన్ని అవమానించిన ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై కోర్టులో పిటిషన్ దాఖలైంది. పాట్నాలో ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ గీతం ఆలపిస్తుండగా, Read more

నేడు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్
నేడు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. ఇది 2025-26 బడ్జెట్‌కు ముందుగా విడుదలయ్యే ప్రీ-బడ్జెట్ నివేదిక. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *