ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 11 గంటలకు ప్రకటించారు. ఫస్టియర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 70గా నమోదవగా, సెకండియర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 83గా నమోదైంది. ఈ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది.

ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులందరికీ హార్దిక శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. ఫస్టియర్ లో 47% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు,సెకండియర్ లో 69% విద్యార్థులు విజయం సాధించారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే: ఫస్టియర్ లో 11 శాతం పెరుగుదల,సెకండియర్ లో 9 శాతం పెరుగుదల, ఈ గణాంకాలు ప్రభుత్వ విద్యా రంగంలో సంభవించిన నాణ్యతా మార్పులకు ప్రతిబింబం అనే చెప్పాలి.
చంద్రబాబు స్పందన
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా స్పందిస్తూ, ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కొత్త శకానికి నాంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఈ స్థాయిలో ఫలితాలు సాధించటం గర్వించదగ్గ విషయం, అని అన్నారు. అంతేకాక, ఇది తాము చేపట్టిన విద్యా సంస్కరణల ఫలితం అని స్పష్టం చేశారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, కేంద్రీకృత మూల్యాంకనం, పర్యవేక్షణ, నూతన సమయపాలన, 100 రోజుల సక్సెస్ కార్యక్రమం, తరగతుల వారీగా వాట్సాప్ గ్రూపులు, సంరక్షకుల వ్యవస్థ ఇలా విద్యా రంగంలో మేము ప్రవేశపెట్టిన సంస్కరణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయి అని చంద్రబాబు వివరించారు.
Read also: B R Naidu: గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన టీటీడీ ఛైర్మన్