Chandrababu Naidu : మద్రాస్ ఐఐటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మద్రాస్ ఐఐటీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఐఐటీ విద్యార్థిని సృజన తన సందేహాన్ని సీఎం చంద్రబాబుకు వ్యక్తం చేసింది.సృజన తనను తాను తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన అమ్మాయిగా పరిచయం చేసుకుని, ప్రతీ ఇంట్లో టెక్నాలజీ అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) నేర్చుకోవాలి అన్నారు కదా.అయితే ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలను మరింత అభివృద్ధి చేసేందుకు విద్యావ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఐఐటీలను మీరు ఇందులో ఎలా భాగస్వాములను చేస్తారు? అని ప్రశ్నించింది.ఆమె ప్రశ్నను శ్రద్ధగా విన్న చంద్రబాబు, సృజనను చూశారు.నువ్వు ఎప్పుడు పుట్టావమ్మా?” అని ప్రశ్నించారు.సృజన 1997లో పుట్టానని సమాధానం చెప్పింది.

దీనిపై చంద్రబాబు చిరునవ్వుతో, నువ్వు పుట్టడానికి రెండేళ్ల ముందే నేను ముఖ్యమంత్రిని అయ్యాను. నీది ఏ జిల్లా? అని అడిగారు. “కరీంనగర్,” అని ఆమె చెప్పగానే చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.నువ్వు హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఉంటావు కదా. ఎంతగా ఎదిగిందో తెలుసు. నిజమైన అభివృద్ధి ఆలోచనల వల్ల జరుగుతుంది. వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యం. భవిష్యత్తు పూర్తిగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారంగా ఉంటుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ గురించి పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లోనే దీని ప్రాముఖ్యతను గుర్తించాను. ఇప్పుడు అదే విధంగా, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్పడానికి ఎక్కువమందికి అవగాహన లేదు.ప్రస్తుతం భారతదేశంలో 68% మంది ఏఐను ఉపయోగిస్తున్నారు.అంతేగాక హైదరాబాద్‌ను ఎవరు అభివృద్ధి చేశారో గూగుల్ అంకుల్‌ను అడగండి!
ఏఐ సాయంతో సమాధానం వెంటనే వస్తుంది.చాలామంది తెలిసో తెలియకో ఏఐని ఉపయోగిస్తున్నారు.కానీ నిజమైన శక్తి రియల్ డేటాలో ఉంటుంది.సరైన డేటా ఉంటే, ఏమైనా సాధ్యమే.ఇప్పుడంతా సెన్సార్ల సాయంతో ఎన్నో పనులు చక్కబెట్టుకుంటున్నాం.ఉదాహరణకు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సెన్సార్లు చెబుతాయి.దాని ఆధారంగా మనం సరైన ఆహారపు అలవాట్లను పాటించవచ్చు.ఉదాహరణగా నా వేలికి ఉన్న రింగ్‌ను చూడండి.ఇది పూజారి ఇచ్చిన ఉంగరం కాదు.ఏ మూఢ నమ్మకాల కోసం ధరించిన వస్తువు కాదు.ఇది ఒక మానిటరింగ్ డివైస్.నేను ఉదయం లేవగానే నా శరీరం ఎంతగా సంసిద్ధంగా ఉందో ఈ రింగ్ తెలియజేస్తుంది.నిద్ర నాణ్యత గుండె వేగం వంటి అనేక ఆరోగ్య సంబంధిత వివరాలను ఇది నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తుంది.ఇలా చంద్రబాబు తన అనుభవాలను పంచుకుంటూ, భవిష్యత్ టెక్నాలజీల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వడమే కాకుండా, టెక్నాలజీ ద్వారా అందరూ ఎదగాలని ఆకాంక్షించారు.