నందిగామ నియోజకవర్గంలోని ముప్పాళ్లకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శన చేశారు. రాజకీయ నేతగా కాకుండా, ఓ స్నేహితుడిలా, ఓ పెద్ద మనిషిలా ఆ గ్రామాన్ని పలకరించారు.ఆయన పర్యటన పూర్తిగా హృదయాన్ని హత్తుకునేలా సాగింది.ప్పాళ్లలో ఓ సాధారణ వ్యక్తి ఇంటికి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు, ఆ కుటుంబాన్ని చాలా స్నేహపూర్వకంగా పలకరించారు. ఇంట్లో ఒక్కొక్కరిని అడిగి మరీ కాఫీ అందించడం ద్వారా ఆయన అనుసరించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.ఒక్కనాటకీయతా లేకుండా ఎంతో స్వాభావికంగా ఆయన ప్రవర్తించారు.ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను చూసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన చంద్రబాబు, ‘‘కాఫీ తాగుతారా బాబూ? అలవాటు ఉందా?

అని సన్నగా నవ్వుతూ అడగడం ఆ వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మార్చింది.ఇది చూసిన వారందరికీ ఆయనలోని మానవీయ కోణం మరింత స్పష్టంగా కనిపించింది.సీఎం చంద్రబాబు అందరితో కలిసి కాఫీ తీసుకుంటూ, హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్‌కూ స్వయంగా కాఫీ అందించడంలో ఆయన వినమ్రత స్పష్టంగా కనిపించింది. ఒక నేత గా కాకుండా, ఓ వ్యక్తిగా వ్యవహరించిన ఆయన మనసుకు హత్తుకునేలా మాట్లాడారు.కాఫీ తాగుతూనే, ‘‘మీ సమస్యలు ఏమిటో చెప్పండి’’ అంటూ అడిగి తెలుసుకోవడం చంద్రబాబు ప్రత్యేకత. ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, వారికి తోడుగా నిలవాలన్న సంకల్పం ఈ సందర్భంగా కనిపించింది. అక్కడున్నవారు కూడా ఆయనకీ స్నేహపూర్వకంగా స్పందించారు.
READ ALSO : Revanth Reddy : కంచ భూముల పై రేవంత్ రెడ్డి సమీక్ష