శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం భారీగా పెరగడంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎగువ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో శ్రీశైలం డ్యాంలోకి నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం ఇది 880 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రేపు సీఎం చంద్రబాబు నాయుడు డ్యామ్ గేట్లను స్వయంగా ఎత్తనున్నారని సమాచారం.
నాగార్జునసాగర్‌కు నీటి విడుదల – పూర్ణంగా నదీ జలాల ప్రారంబం
శ్రీశైలం డ్యాం గేట్లు (Srisailam Dam Gates) ఎత్తి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేయనున్న కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు నదీ జలాలకు చీరసారె సమర్పించి పూజలు నిర్వహించనున్నట్లు వార్తలున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమ మరియు దక్షిణ ఆంధ్ర ప్రాంతాలకు సాగునీటి సరఫరా ప్రారంభం కానుంది.
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు – ఉత్సాహంలో రైతులు
ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయినా ఇప్పటికే శ్రీశైలం ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు, అధికారుల పర్యటనలు ప్రారంభమయ్యాయి. సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులు సీఎం పర్యటనతో ఉత్సాహానికి లోనవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని వేగంతో చంద్రబాబు నాయుడు (Chandrababu) మళ్లీ నీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం రైతుల్లో ఆశలు నూరుస్తోంది. అధికారిక ప్రకటన వస్తే ఇది మరో చారిత్రాత్మక ఘటనగా గుర్తించబడే అవకాశం ఉంది.
Read Also : Satyavathi Rathod : కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కీలక వ్యాఖ్యలు