CBN ABV

ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు గుడ్ న్యూస్

ఏపీలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన ఏబీకి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పలు అభియోగాలు మోపి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన ఇబ్బందులు మొదలయ్యాయి.తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఏబీకి వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై గత వైసీపీ ప్రభుత్వం అభియోగాలు మోపి సస్పెండ్ చేసింది. కోర్టులో ఊరట లభించినా తిరిగి సస్పెండ్ చేసింది. దీంతో సస్పెన్షన్ కాలంలో ఆయనకు చెల్లించాల్సిన జీత భత్యాల్ని కూడా నిలిపేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆయన క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ లో ఉన్న కాలంలో జీత భత్యాలు చెల్లించాల్సి ఉంది. అయినా వీటిని చెల్లించకుండా ఆలస్యం చేశారు.

Advertisements

తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో జరిగిన తప్పిదాలను సవరించడం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయనపై గత వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన అభియోగాల్ని కూటమి సర్కార్ ఉపసంహరించుకుంది. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన రెండుసార్లు సస్పెండ్ అయిన కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు అప్పట్లో సస్పెన్షన్ కాలంలో బకాయి ఉన్న జీత భత్యాల్ని చెల్లించబోతున్నారు.

Related Posts
లేడీ అఘోరీ అరెస్ట్..
aghori arest

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దీ రోజులుగా లేడి అఘోరి హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యాచారాలు, గోహత్యల నివారణకే నేనున్నా అని అందుకోసం ఎన్నో పూజలు Read more

ఏపీలో ఉచిత బస్సుపై మంత్రి సంధ్యారాణి కీలక ప్రకటన
Minister Sandhya Rani key statement on free buses in AP

అమరావతి: ఏపీలో మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన మరో కీలకమైన హామీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. ఈ హామీ అమలుపై Read more

Vangalapudi Anita: కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నా హోంమంత్రి
Vangalapudi Anita: కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నా హోంమంత్రి

శ్రీరామనవమి సందర్భంగా హోంమంత్రి అనిత తిరుమల దర్శనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. Read more

నేడు మిర్చి యార్డ్, ట్రేడర్లతో సీఎం భేటీ
CM Chandrababu meet with Mirchi yard and traders today

మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంఅమరావతి: మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక, పాలక, ప్రతిపక్ష నేతల ఎంట్రీతో.. మిర్చి ధరలకు రాజకీయరంగు Read more

×