Chandrababu: పవన్ కల్యాణ్ కు, జనసైనికులకు శుభాకాంక్షలు జనసేన పార్టీ తన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ‘జయకేతనం’ సభ నిర్వహించనున్నారు.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన శ్రేణులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన చంద్రబాబు, జనసేన పార్టీ ప్రజాసేవా నిబద్ధతకు, విలువల రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తోందని ప్రశంసించారు.జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రయాణం ఎంతో అర్ధవంతంగా సాగింది. ప్రజల కోసం పోరాడే జనసైనికుల కృషి అభినందనీయమైనది అని ఆయన పేర్కొన్నారు. ఇక జనసేన పార్టీని స్థాపించి ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాసమస్యలపై నిబద్ధతతో ముందుకు సాగుతున్న ధీశాలి.
రాష్ట్ర అభివృద్ధికి మంచి పాలనకు ఆయన పూర్తి మద్దతుగా ఉంటారు అని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనతో కలిసి పవన్ కల్యాణ్ అభివాదం చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ, ఈ 12 ఏళ్ల జనసేన ఉద్యమం మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అంటూ ఆకాంక్షించారు. ఇకపోతే జనసేన ఆధ్వర్యంలో జరగబోయే ‘జయకేతనం’ సభపై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రత్యేకంగా ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జనసైనికులు పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో హాజరయ్యే అవకాశం ఉంది.
2014లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ప్రజాసమస్యలపై తన ప్రత్యేక పోరాటాన్ని ప్రారంభించారు.ప్రత్యేక హోదా రైతుల సంక్షేమం, నిరుద్యోగులకు న్యాయం వంటి అనేక అంశాలపై జనసేన తన గళం వినిపించింది.ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నుంచి జనసేనకు వచ్చిన ఈ శుభాకాంక్షలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల సందర్భంగా జనసేన పాత్ర కీలకంగా మారనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ సందర్భంగా జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నారు.సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ అభిమానులు Janasena12Years అనే హ్యాష్ ట్యాగ్ తో సందడి చేస్తున్నారు.మొత్తంగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన ఈ శుభాకాంక్షలు జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.