Chandrababu cabinet meeting 585x439 1

Chandrababu: ఇసుక విధానంపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన ఇసుక విధానంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం జరిగిన సమీక్షలో, ఉచిత ఇసుక విధానం సరైన రీతిలో అమలు జరగాలని, ఇసుకను పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇసుక సులభంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సీనరేజ్ విధానాన్ని రద్దు చేసినట్టు సీఎం తెలిపారు.

తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు చెందిన ప్రధాన నగరాలు చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు ఏపీ నుంచి ఇసుక అక్రమంగా తరలింపులు జరుగుతున్నాయని గుర్తించిన సీఎం, ఈ మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.

ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు స్వీకరించే సరికొత్త ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన సీఎం, గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాల కోసం ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు, లోడింగ్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులపై బాధ్యతగా అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు

Related Posts
తెలంగాణ, మహారాష్ట్రపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ, మహారాష్ట్రపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి వేదికను Read more

Chandrababu: పవన్ కల్యాణ్ కు, జనసైనికులకు శుభాకాంక్షలు
Chandrababu పవన్ కల్యాణ్ కు జనసైనికులకు శుభాకాంక్షలు

Chandrababu: పవన్ కల్యాణ్ కు, జనసైనికులకు శుభాకాంక్షలు జనసేన పార్టీ తన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ Read more

Visakhapatnam Stadium: స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొల‌గించ‌డంతో వైసీపీ నేతల ధర్నా
Visakhapatnam Stadium: YSR పేరు తొలగింపు.. స్టేడియం వద్ద వైసీపీ నేతల ధర్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరు నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్) పేరు తొలగింపు వివాదాస్పదంగా Read more

ముండ్లమూరులో వరుసగా భూప్రకంపనలు
earthquakes prakasam distri

ప్రకాశం జిల్లా ముండ్లమూరులో వరుసగా మూడు రోజులుగా భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం మొదలైన ప్రకంపనలు ఆదివారం, సోమవారం వరకు కొనసాగాయి. Read more