Central Government has released huge funds to the Telugu States

కేంద్రం గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల

తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయింపులు చేసింది. ఏపీకి 498 కోట్లు,తెలంగాణకి 516 కోట్ల నిధులు విడుదల చేసింది. ఏపీలో 200.06 కిమీ పొడవైన 13 రాష్ట్ర రహదారులకు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి నుంచి నిధులు కేటాయించారు. గుంటూరు నల్లపాడు రైల్వే మార్గంలో శంకర్ విలాస్ ఆర్ ఓబీ ని నాలుగు వరుసల నిర్మాణానికి 98 కోట్లు కేటాయింపులు చేశారు.

తెలంగాణలో NH 565లోని నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య 14 కి.మీ పొడవు, 4-లేన్ బైపాస్ నిర్మాణానికి 516 కోట్లు మంజూరు చేసింది కేంద్రం. బైపాస్ రోడ్డు నిర్మాణంతో నల్గొండ టౌన్ కి ట్రాఫిక్‌ తగ్గనుంది. నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య పెరగనుంది కనెక్టివిటీ. అటు ఏపీ తెలంగాణ మధ్య కీలకమైన జాతీయ రహదారిగా ఉంది NH 565. తెలంగాణలోని నకిరేకల్ వద్ద NH 65 తో జంక్షన్ నుండి ప్రారంభమై నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం కనిగిరి పట్టణాల గుండా వెళుతోంది NH 565.

Related Posts
38వ నేషనల్ గేమ్స్ ప్రారంభించిన ప్రధాని మోదీ
38వ నేషనల్ గేమ్స్ ప్రారంభించిన ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ నేషనల్‌ గేమ్స్‌ అంగరంగా ప్రారంభమయ్యాయి. ఈ ఘన కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం అద్భుతంగా జరిగింది, కళాకారుల Read more

పోసాని అరెస్టుతో వైసీపీ నిరసనలు.
పోసాని కృష్ణమురళి కేసుపై కీలక పరిణామాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేసిన ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో Read more

వచ్చే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు
Four Kumbh mel

ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు ఇటీవల ముగిసిన మహా కుంభమేళా మరో 144 ఏళ్లకు మాత్రమే తిరిగి జరుగుతుంది. అయితే వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా నలుగురు పవిత్ర నగరాల్లో Read more

కొండా సురేఖకు భారీ షాక్.. కోర్టు నోటీసులు
Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కోర్టు షాకిచ్చింది. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను Read more