Center is good news for Gun

గుంటూరు జిల్లాకు కేంద్రం గుడ్ న్యూస్

NDA తో టీడీపీ జత కట్టడం తో ఏపీకి వరుస గుడ్ న్యూస్ అందజేస్తుంది కేంద్రం. ముఖ్యంగా రాష్ట్రానికి నిధుల సమస్య అనేది లేకుండా అవుతుంది. రాజధాని జిల్లా అయిన గుంటూరుకు NDA సర్కార్ భారీ శుభవార్త తెలిపింది.

గుంటూరు నగరంలో శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్‌ ఉంది. అప్పటి నగర జనాభాకు తగ్గట్టు ఈ ఫ్లైఓవర్‌ నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్‌ ఇరుకుగా మారింది. ఇక్కడ మరో ఫ్లై ఓవర్‌ నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా ఫ్లైఓవర్‌కు మాత్రం మోక్షం కలగలేదు. ఇరుకైన రోడ్లలో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతూ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. అయితే ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఫ్లైఓవర్‌ నిర్మిస్తామని కూటమి తరఫున పోటీ చేసిన లోక్‌సభ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కేంద్రం తో మాట్లాడి నూతన ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేసారు.

ఈ సందర్భంగా కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కర్‌ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. గుంటూరులోని శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నాం. రూ.98 కోట్లు మంజూరు చేశాం. ఈ నిధులతో గుంటూరులో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగనున్నాయి’ అని నితిన్‌ గడ్కరీ తెలిపారు. అంతేకాకుండా ఏపీలో రోడ్ల నిర్మాణానికి రూ.400 కోట్లు మంజూరు కావడం విశేషం. రాష్ట్రంలో 200 కిలోమీటర్ల మేర 13 రాష్ట్ర రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలపడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు ఫ్లై ఓవర్‌కు నిధులు విడుదల కావడంపై కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ పెమ్మసాని స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts
డాన్స్ చేస్తూ యువతి మృతి.. వీడియో వైరల్
డాన్స్ చేస్తూ యువతి మృతి.. వీడియో వైరల్

అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటిదాకా సంతోషంగా గడిపిన ఆ కుటుంబం బోరున విలపించింది. సోదరి పెళ్లి వేడుకలో డాన్స్ Read more

తెలంగాణ లో ఐదేళ్లలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి – కేంద్రం
telangana Highway roads

తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో 2,722 కి.మీ మేర హైవేలను నిర్మించామని కేంద్ర మంత్రి నితిన్ Read more

తెలుగు తేజాలకు అర్జున పుర‌స్కారాలు
arjun awards

మన తెలుగు అమ్మాయిలకు రెండు అర్జున పుర‌స్కారాలు లభించాయి.కేంద్రం ప్ర‌క‌టించిన జాతీయ క్రీడా పుర‌స్కారాల్లో తెలుగు తేజాలు ఇద్ద‌రు ఎంపిక‌య్యారు. అథ్లెటిక్స్ విభాగంలో య‌ర్రాజి జ్యోతి, పారా Read more

Krishna District:బాలిక పై సామూహిక లైంగికదాడి
Krishna District:బాలిక పై సామూహిక లైంగికదాడి

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలికను నిర్బంధించి నాలుగు రోజులపాటు సామూహిక లైంగికదాడికి పాల్పడిన Read more