Center is good news for gig workers.. insurance for crores!

గిగ్ వర్కర్లకు కేంద్రం శుభవార్త.. కోటి మందికి బీమా!

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్‌ పార్లమెంటులో ప్రవేశ‌పెట్టారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపిస్తున్నారు. కేంద్రం గిగ్ వర్కర్లకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న (స్విగ్వీ, జొమాటో) వలే డెలివరీ సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు కోటి మంది వరకు బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటన చేసింది. అందుకోసం గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరేలా గుర్తింపు కార్డులను సైతం కేంద్రం ప్రకటించింది. కోటి మంది గిగ్ వర్కర్లకు పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమాను అమలు చేయనున్నారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా గిగ్ వర్కర్ల పేర్లను నమోదు చేసుకోవచ్చని కేంద్రం సూచించింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రహదారులపై సంచరించే వారికి బీమా సౌకర్యం ఎంతగానో ఉపయోగపడనుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisements
image

పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల పాటు ప్రణాళిక రూపొందించామని.. ప్రయోగాత్మకంగా పీఎం ధన్‌ధాన్య కృషి యోజన తీసుకొచ్చామన్నారు. 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. వలసలు అరికట్టడంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. మూడు రకాల పప్పు ధాన్యాల్లో స్వయం సంవృద్ధి సాధించామన్నారు. బిహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధిక దిగుబడి విత్తనాల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్‌ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపుతో 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం తీసుకువచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

Related Posts
రాహుల్‌గాంధీపై విచారణ
rahul

పార్లమెంటు ఆవరణలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య చోటుచేసుకున్న బాహాబాహీ ఘటనకు సంబంధించి.. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ప్రశ్నించనున్నట్లుగా ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎంపీల మధ్య Read more

RBI: ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపుతో వడ్డీ రేట్లు తగ్గే లోన్లు
ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపుతో వడ్డీ రేట్లు తగ్గే లోన్లు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. రెండు నెలల కాల వ్యవధిలో మరోసారి వడ్డీ రేట్లను సవరించింది. దీంతో రెపో రేట్ Read more

ఆప్ పథకాలపై గవర్నర్ దర్యాప్తు
పథకాలు ఆపేందుకు ఆ రెండు పార్టీలు కలిశాయి: కేజ్రీవాల్

ఆప్ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తుకు ఆదేశం లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఆప్ ఢిల్లీ సంక్షేమ పథకాలపై దుమారం రేగింది. కాంగ్రెస్ నాయకుడు సందీప్ Read more

YCP Iftar Dinner : ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్
ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్

రంజాన్ పవిత్రమైన నెల సందర్భంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రత్యేక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు విజయవాడ గురునానక్ కాలనీలోని Read more

×